ఇక చెట్ల నరికివేత ఆపండి.. ‘ సేవ్ ఆరే ‘.. సుప్రీంకోర్టు ఆదేశం

ముంబైలోని ఆరే కాలనీలో ఇక చెట్ల నరికివేతను ఆపివేయాలని సుప్రీంకోర్టు.. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అక్కడ యధాతథ స్థితిని కొనసాగించాలని న్యాయమూర్తులు జస్టిస్ అరుణ్ మిశ్రా, అశోక్ మిశ్రాలతో కూడిన డివిజన్ బెంచ్ సూచించింది. చెట్ల నరికివేతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై తిరిగి ఈ నెల 21 న విచారణ చేపడతామని కోర్టు పేర్కొంది. ఈ కాలనీలో ఇష్టం వఛ్చినట్టు చెట్లను నరికివేస్తున్నారని, దీన్ని అడ్డుకోవాలంటూ కొందరు లా విద్యార్థులు నేరుగా చీఫ్ జస్టిస్ రంజన్ […]

ఇక చెట్ల నరికివేత ఆపండి.. ' సేవ్ ఆరే '.. సుప్రీంకోర్టు ఆదేశం
Follow us

| Edited By: Srinu

Updated on: Oct 07, 2019 | 4:32 PM

ముంబైలోని ఆరే కాలనీలో ఇక చెట్ల నరికివేతను ఆపివేయాలని సుప్రీంకోర్టు.. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అక్కడ యధాతథ స్థితిని కొనసాగించాలని న్యాయమూర్తులు జస్టిస్ అరుణ్ మిశ్రా, అశోక్ మిశ్రాలతో కూడిన డివిజన్ బెంచ్ సూచించింది. చెట్ల నరికివేతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై తిరిగి ఈ నెల 21 న విచారణ చేపడతామని కోర్టు పేర్కొంది. ఈ కాలనీలో ఇష్టం వఛ్చినట్టు చెట్లను నరికివేస్తున్నారని, దీన్ని అడ్డుకోవాలంటూ కొందరు లా విద్యార్థులు నేరుగా చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ కే లేఖ రాశారు. ఆ లేఖను ‘ పిల్ ‘ గా పరిగణించిన కోర్టు.. సూమోటోగా విచారణకు స్వీకరించింది. ఈ కాలనీలో ఇక చెట్ల నరికివేత జరగదని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు. ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్ వైఖరికి నిరసనగా ఆందోళన చేసి.. అరెస్టయిన విద్యార్థులు విడుదలవుతున్నారని కూడా ఆయన వెల్లడించారు. కాగా-ఈ విషయంలో అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖలను కూడా ప్రతివాదులుగా చేర్చాలని కోర్టు ఆదేశించింది.

ఆరే కాలనీలో అటవీ ప్రాంతం కూడా ఉందని, అయితే చెట్ల నరికివేత వల్ల పర్యావరణానికి హాని కలుగుతుందంటూ ఎంజీవోలు, కొందరు యాక్టివిస్టులు దాఖలు చేసిన పిటిషన్లను బాంబే హైకోర్టు కొట్టివేయడంతో గత శుక్రవారం రాత్రి నుంచి ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్ చెట్ల నరికివేతను ప్రారంభించింది. ఈ కాలనీలో ఇప్పటివరకు సుమారు 2,600 చెట్లను అటవీ శాఖ సిబ్బంది కూల్చివేశారు. తాజాగా సుప్రీంకోర్టు ఆదేశాలతో మెట్రో రైల్ కార్పొరేషన్ తన ‘ చెట్ల నరికివేత ‘ కార్యక్రమాన్ని వాయిదా వేసుకుంది. ఆరే ప్రాంతంలో ‘ మెట్రో కార్ షెడ్ ‘ ఏర్పాటుకు అనువుగా ఈ సంస్థ ఈ చర్య చేబట్టింది.

చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు