అక్కడ.. 2 కిలోమీటర్లు ముందుకు వచ్చిన సముద్రం!

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచమంతా లాక్‌డౌన్ లో ఉండిపోయింది. ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. అయితే.. తుపానులు, వాయు గుండాలు ఏర్పడినపుడు

అక్కడ.. 2 కిలోమీటర్లు ముందుకు వచ్చిన సముద్రం!
Follow us

| Edited By:

Updated on: May 25, 2020 | 3:58 PM

No moon effect on the sea: కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచమంతా లాక్‌డౌన్ లో ఉండిపోయింది. ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. అయితే.. తుపానులు, వాయు గుండాలు ఏర్పడినపుడు సముద్రంలో అల్లకల్లోలం సహజం. కానీ అవేవీ లేనప్పుడు సముద్రం ముందుకు చొచ్చుకురావడం చూశారా! 2 మీటర్లు కాదు ఏకంగా 2 కిలోమీటర్ల ముందుకు చొచ్చుకు వచ్చింది. తూర్పుగోదావరి జిల సఖినేటిపల్లి మండలం కేశవదాసుపాలెంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. నిన్న అమావాస్య కాబట్టి సముద్రంలో పోటు ఎక్కువై ఇలా జరిగిందని చెబుతున్నారు.

కానీ ఎన్నో అమావాస్యలు వచ్చాయి.. ఇలా మాత్రం ఎప్పుడూ జరగలేదు. ఇదంతా ఏంటనే భయం అక్కడి ప్రజలను వెంటాడుతోంది. ఈ ఘటనతో 2 కిలోమీటర్ల మేర పొలాలు నాశనమయ్యాయి.అమావాస్య, పౌర్ణమి రోజుల్లో సముద్రం ఆటు పోట్లకు గురవుతుంటుంది. దీంతో 20 లేదా 30 మీటర్ల వరకు ముందుకు రావడం జరుగుతుంది. ఇటువంటి ఉత్పాతాలు సునామిలాంటి సందర్భాల్లో మాత్రమే ఏర్పడుతాయి. కానీ అటువంటి హెచ్చరికలు ఏమీలేవు. స్థానికులకు పరిస్థితి అర్థంకాక తలలు పట్టుకుంటున్నారు.