Breaking News
  • సికింద్రాబాద్‌-మచిలీపట్నం మధ్య ప్రత్యేక రైళ్లు. డిసెంబర్‌ 1,8,15,22,29 తేదీల్లో నడవనున్న ప్రత్యేక రైళ్లు. మచిలీపట్నంలో మధ్యాహ్నం 2:25కి బయల్దేరి.. రాత్రి 10:10కి సికింద్రాబాద్‌కు చేరుకోనున్న ప్రత్యేక రైలు. అదేరోజు సికింద్రాబాద్‌ నుంచి రాత్రి 11:55కి బయల్దేరి.. మరుసటి రోజు ఉ.8:55కి మచిలీపట్నం చేరుకోనున్న ప్రత్యేక రైలు.
  • ఏపీకి నెంబర్లు కేటాయించిన కేంద్రం. అక్రమ మైనింగ్‌, అనధికార మద్యం అమ్మకాలపై.. ఫిర్యాదులకు నెంబర్లు కేటాయించిన కేంద్ర సర్కార్‌. అక్రమ మైనింగ్‌పై ఫిర్యాదు కోసం 14400 నెంబర్‌.. అనధికార మద్యంపై ఫిర్యాదుకు 14500 నెంబర్‌ కేటాయింపు.
  • మళ్లీ పెరిగిన బంగారం ధరలు. పెళ్లిళ్ల సీజన్‌ కొనుగోళ్లతో పెరిగిన పసిడి ధరలు. 10గ్రాముల 24క్యారెట్ల బంగారంపై రూ.225 పెంపు. రూ.38,715 పలుకుతున్న 10గ్రాముల బంగారం. రూ.440 పెరిగి రూ.45,480కి చేరిన కిలో వెండి ధర.
  • ఛండీగడ్‌: 2019 ప్రపంచ కబడ్డీ కప్‌కు పంజాబ్ ఆతిథ్యం. డిసెంబర్‌ 1 నుంచి 9 వరకు మ్యాచ్‌ల నిర్వహణ. సుల్తాన్‌పూర్‌ లోధిలోని గురునానక్‌ స్టేడియంలో ప్రారంభ వేడుక. ప్రపంచ కబడ్డీ టోర్నీలో పాల్గొననున్న భారత్, అమెరికా, శ్రీలంక.. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, కెన్యా, న్యూజిలాండ్‌, పాకిస్తాన్‌, కెనడా జట్లు.
  • ఓటర్ల జాబితా సవరణకు కొత్త షెడ్యూల్‌ విడుదల. జనవరి 1, 2020 అర్హత తేదీతో ఓటర్ల జాబితా సవరణ. ఓటర్ల వివరాల పరిశీలనకు ఈనెల 30 తుది గడువు. డిసెంబర్‌ 16న ఓటర్ల జాబితా ముసాయిదా ప్రచురణ. 2020, జనవరి 15న అభ్యంతరాలు, వినతుల స్వీకరణ.
  • టిక్‌టాక్‌కు పోటీగా త్వరలో ఇన్‌స్టాగ్రామ్‌ కొత్త ఫీచర్‌. రీల్స్‌ పేరిట ఓ కొత్త ఫీచర్‌ అందుబాటులోకి. ఇన్‌స్టాగ్రామ్‌లోని ఎక్స్‌ప్లోర్‌ సెక్షన్‌లో కొత్త ఫీచర్. కొత్త ఫీచర్‌లో టిక్‌టాక్ మాదిరిగా వీడియోలు క్రియేట్‌ చేసే సౌకర్యం.

గత 50 ఏళ్లుగా ప్రజా పోరాటాలు… వారితో మాకు లింకేంటీ?

No links with Maoists to our organizations says protesters

గత యాభై ఏళ్లుగా ఎన్నో ప్రజల సమస్యలపై పోరాడిన తమను నిషేధిత సంఘాలుగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ పేర్కొనడంపై ఆయా ప్రజాసంఘాల నేతలు తీవ్రంగా ఖండించారు. మానవహక్కుల వేదిక, పౌర హక్కుల సంఘం, విరసం, కులనిర్మూలన పోరాట సమితి, రాజకీయ ఖైదీల విడుదల కమిటీ, తెలంగాణ ప్రజాస్వామిక వేదిక, టీపీఎఫ్, చైతన్య మహిళా సంఘం, తెలంగాణ విద్యార్ధి వేదిక, ఆదివాసీ విద్యార్ధి సంఘం, తుడుందెబ్బతో సహా మొత్తం 23 ప్రజా సంఘాల నేతలు ఉమ్మడిగా సమావేశమై ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు . సీపీ అంజనీ కుమార్ వ్యాఖ్యలు రాజకీయ నేత మాట్లాడినట్టుగా ఉన్నాయని వారు ఆగ్రహం వ్యక్త చేశారు. గత యాభై ఏళ్లుగా ప్రజలతో మమేకమై, రచయితలుగా, కళాకారులుగా, హక్కుల కార్యకర్తలుగా, ప్రత్యేక తెలంగాణ ఉద్యమ నాయకులుగా, మహిళా సంఘాల ప్రతినిధులుగా ఎన్నో పోరాటాలు చేశామని వారు వివరించారు.  ప్రజల పక్షాన నిలిచిన తమను అణిచివేసే దిశగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం తమపై తప్పుడు ప్రచారం చేయడాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్టు సంఘాల ప్రతినిధులు పేర్కొన్నారు. ప్రజల తరపున నిలిచి నిజాయితీగా పోరాడుతున్న తమ గొంతును నొక్కేలా ప్రభుత్వం కుట్ర చేస్తుందని, తమ సంఘాలను మావోయిస్టుల పేరుతో భయపెట్టడం ప్రభుత్వానికి అలవాటుగా మారిందని వారు ఆరోపించారు.