ఢిల్లీలో నిజాం నగల ప్రదర్శన

అరుదైన నిజాం నగల ప్రదర్శనకు మరోసారి ఢిల్లీ వేదికైంది. ఢిల్లీ నేషనల్ మ్యూజియంలో నిజాం ఆభరణాలను ప్రదర్శనకు ఉంచారు. 18వ శతాబ్దానికి చెందిన నిజాం ఆభరణాల ధగధగలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. అత్యంత విలువైన 173 రకాల నిజాం నగలను ఎగ్జిబిషన్లో ప్రదర్శనకు ఉంచారు. 184.75 క్యారెట్ల జాకబ్ డైమండ్ ప్రదర్శనకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ప్రపంచంలోని అతిపెద్ద వజ్రాల్లో ఇదొకటి. గొల్కొండ గనుల్లోంచి వజ్రాలు, బర్మాకెంపులు, గల్ఫ్ ఆఫ్ మన్నార్లో దొరికే అరుదైన ముత్యాలను కూడా ఇందులో […]

  • Tv9 Telugu
  • Publish Date - 7:40 am, Thu, 21 February 19

అరుదైన నిజాం నగల ప్రదర్శనకు మరోసారి ఢిల్లీ వేదికైంది. ఢిల్లీ నేషనల్ మ్యూజియంలో నిజాం ఆభరణాలను ప్రదర్శనకు ఉంచారు. 18వ శతాబ్దానికి చెందిన నిజాం ఆభరణాల ధగధగలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. అత్యంత విలువైన 173 రకాల నిజాం నగలను ఎగ్జిబిషన్లో ప్రదర్శనకు ఉంచారు. 184.75 క్యారెట్ల జాకబ్ డైమండ్ ప్రదర్శనకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ప్రపంచంలోని అతిపెద్ద వజ్రాల్లో ఇదొకటి.

గొల్కొండ గనుల్లోంచి వజ్రాలు, బర్మాకెంపులు, గల్ఫ్ ఆఫ్ మన్నార్లో దొరికే అరుదైన ముత్యాలను కూడా ఇందులో ప్రదర్శిస్తున్నారు. వజ్ర వైఢూర్యాలు పొదిగిన గాజులు, చెవిపోగులు, కవచాలు, ఉంగరాలు, పాకెట్ వాచీ ఉన్నాయి. ఢిల్లీలో ఆ నగల ప్రదర్శన మే5 వరకూ జరుగుతుంది. ఎంట్రీ టికెట్ ఒక్కొక్కరికి 50 రూపాయలు. ఒక్కో షోకి 50 మంది సందర్శకులను మాత్రమే అనుమతిస్తారు. అరగంటపాటు నగల ప్రదర్శనను తిలకించవచ్చు.