నీరవ్ మోదీ ఆర్ధిక నేరగాడు.. ముంబై కోర్టు

వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని పరారీలో ఉన్న ఆర్ధిక నేరస్థునిగా ముంబై హైకోర్టులో ని ప్రత్యేక కోర్టు ప్రకటించింది. ప్రస్తుతం లండన్ లో గల వాండ్స్ వర్త్ జైలులో ఉన్న ఈయనను ఈ మేరకు ప్రకటించాలని ఈడీ తన పిటిషన్ లో కోరింది. పంజాబ్ నేషనల్ బ్యాంకును రూ 14 వేల కోట్ల మేర మోసగించిన కేసులో దోషి అయిన ఈయన క్రిమినల్ ప్రాసిక్యూషన్ ను తప్పించుకునేందుకు విదేశాలకు పారిపోయారని ఈడీ పేర్కొంది. స్పెషల్ కోర్టు ఈ […]

నీరవ్ మోదీ ఆర్ధిక నేరగాడు.. ముంబై కోర్టు
Follow us

|

Updated on: Dec 06, 2019 | 8:21 PM

వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని పరారీలో ఉన్న ఆర్ధిక నేరస్థునిగా ముంబై హైకోర్టులో ని ప్రత్యేక కోర్టు ప్రకటించింది. ప్రస్తుతం లండన్ లో గల వాండ్స్ వర్త్ జైలులో ఉన్న ఈయనను ఈ మేరకు ప్రకటించాలని ఈడీ తన పిటిషన్ లో కోరింది. పంజాబ్ నేషనల్ బ్యాంకును రూ 14 వేల కోట్ల మేర మోసగించిన కేసులో దోషి అయిన ఈయన క్రిమినల్ ప్రాసిక్యూషన్ ను తప్పించుకునేందుకు విదేశాలకు పారిపోయారని ఈడీ పేర్కొంది.

స్పెషల్ కోర్టు ఈ సంస్థ అభ్యర్థనను అంగీకరించడంతో.. విదేశాల్లో ఉన్న నీరవ్ ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి మార్గం సుగమమైంది. ఓ ప్రత్యేక చట్టం కింద ఆర్ధిక నేరగాడిగా ప్రకటించిన వ్యక్తుల్లో నీరవ్ మోడీ రెండవ వాడు. మొదట లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాను ఈ ‘ నేరగాడి ‘ గా ప్రకటించారు. అటు-స్పెషల్ కోర్టులో తన కేసు విచారణపై స్టే విధించాల్సిందిగా కోరుతూ నీరవ్ మోడీ బంధువు మెహుల్ చోక్సీ దాఖలు చేసిన విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. ఈయనను కూడా ఆర్ధిక నేరస్థునిగా ప్రకటించాలని ఈడీ కోరింది.