జయరాం కేసులో మరో కొత్త కోణం..!

పారిశ్రామిక వేత్త, ఎక్స్ ప్రెస్ టీవీ అధినేత చిగురుపాటి జయరాం హత్యకేసు విచారణ చివరి దశకు చేరుకుంది. విచారణలో రోజుకు ఒక కొత్త ట్విస్ట్ వెలుగులోకి వస్తోంది. తాజాగా అందిన సమాచారం ప్రకారం జయరాం హత్య జరిగిన రోజు శిఖా చౌదరి లాంగ్ డ్రైవ్ కు వెళ్లినట్లు విచారణలో తేలింది. సంతోష్ అనే యువకుడితో ఆమె లాంగ్ డ్రైవ్ కు వెళ్లిందని.. ఈ కేసుకు.. సంతోష్ కి మధ్య లింక్ ఏమైనా ఉందా అని పోలీసులు ఆరా […]

జయరాం కేసులో మరో కొత్త కోణం..!
Follow us

| Edited By:

Updated on: Oct 18, 2020 | 7:43 PM

పారిశ్రామిక వేత్త, ఎక్స్ ప్రెస్ టీవీ అధినేత చిగురుపాటి జయరాం హత్యకేసు విచారణ చివరి దశకు చేరుకుంది. విచారణలో రోజుకు ఒక కొత్త ట్విస్ట్ వెలుగులోకి వస్తోంది. తాజాగా అందిన సమాచారం ప్రకారం జయరాం హత్య జరిగిన రోజు శిఖా చౌదరి లాంగ్ డ్రైవ్ కు వెళ్లినట్లు విచారణలో తేలింది. సంతోష్ అనే యువకుడితో ఆమె లాంగ్ డ్రైవ్ కు వెళ్లిందని.. ఈ కేసుకు.. సంతోష్ కి మధ్య లింక్ ఏమైనా ఉందా అని పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే పోలీసులు కుత్బుల్లాపూర్ రియల్ ఎస్టేట్ వ్యాపారులను విచారిస్తున్నారు. అంతేకాదు ఏసీపీ మల్లారెడ్డి, సీఐ శ్రీనివాసులను పోలీసులు మరోసారి విచారించనున్నారు.   

జయరాం హత్యకేసులో నలుగురు నేరస్తులను పోలీసులు ఈరోజు సాయంత్రం ప్రకటించనున్నారు. జయరాం హత్య పధకం ప్రకారం, ఆస్తి కోసమే జరిగిందని ఇప్పటికే పోలీసులు నిర్ధారించారు. ప్రధాన నిందితుడైన రాకేష్ రెడ్డి తో సంబంధం ఉన్న పోలీసుల దగ్గర నుండి కొంత సమాచారం ఇప్పటికే సేకరించారు. జయరాం ని హత్య చేసిన తర్వాత దానిని ఆక్సిడెంట్ గా చిత్రీకరించాలని ఒక పోలీసు అధికారి సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. జయరాం హత్య విషయంలో ఇప్పటికే 50 మందిని పోలీసులు విచారించారు. ఇక రాకేష్ రెడ్డి తో సంబంధం ఉన్న ఒక రాజకీయ నేతను కూడా రహస్యంగా పోలీసులు విచారించనున్నారట.