వాట్సాప్‌లో మరిన్ని అదిరిపోయే ఫీచర్లు.. వివరాలివే

ప్రముఖ మెసేజింగ్ యాప్‌ వాట్సాప్‌లో త్వరలో మరిన్ని కొత్త ఫీచర్లు రానున్నాయి. పర్సనల్ మెసేజ్‌లను ఎవరూ చూడకుండా యాప్ ఓపెన్ అవ్వకుండా

వాట్సాప్‌లో మరిన్ని అదిరిపోయే ఫీచర్లు.. వివరాలివే
Follow us

| Edited By:

Updated on: Sep 20, 2020 | 5:06 PM

Whatsapp New Features: ప్రముఖ మెసేజింగ్ యాప్‌ వాట్సాప్‌లో త్వరలో మరిన్ని కొత్త ఫీచర్లు రానున్నాయి. పర్సనల్ మెసేజ్‌లను ఎవరూ చూడకుండా యాప్ ఓపెన్ అవ్వకుండా ఉండేందుకు ఫింగర్ ఫ్రింట్‌ ద్వారా లాక్‌ చేసుకునేలా అవకాశం ఉండగా.. ఇప్పుడు ఈ ఆప్షన్‌ని వాట్సాప్ వెబ్ యూజర్లకి అందుబాటులోకి తీసుకొచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు వేర్వేరు రింగ్‌టోన్లు, ఆండ్రాయిడ్ వెర్షన్‌లో డూడుల్స్‌, కాలింగ్ బటన్ కింది భాగానికి, మరిన్ని యానిమేటెడ్‌ స్టిక్కర్లు, బిజినెస్ ఖాతాలో మరిన్ని మార్పులు చేయనున్నారు.

ఆండ్రాయిడ్ వెర్షన్‌లో డూడుల్స్‌: డెస్క్‌టాప్, వెబ్‌ వెర్షన్‌లో ఇప్పటివరకు ఈ ఆప్షన్ అందుబాటులో ఉండగా.. ఇకపై ఆండ్రాయిడ్ వెర్షన్‌లోకి రానుంది. డూడుల్స్ యాప్‌ని వేరేగా డౌన్‌లోడ్‌ చేసుకోకుండా వాట్సాప్‌లోనే రావొచ్చని తెలుస్తోంది. ఇందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

వేర్వేరు రింగ్‌టోన్లు: వాట్సాప్‌లో గ్రూప్ కాలింగ్‌కి ఓ ప్రత్యేక రింగ్‌టోన్లను పెట్టుకునే అవకాశం కల్పించనుంది. దీంతో మనకు వచ్చేది గ్రూప్ కాల్‌నా లేదా వ్యక్తిగత కాల్‌ అనేది సులభంగా తెలుసుకోవచ్చు. గ్రూప్ కాలింగ్ అయితే వెంటనే అలర్ట్ అవ్వడానికి ఆస్కారముంటుంది.

కింది భాగానికి కాలింగ్ బటన్: కాలింగ్‌ ఇప్రూవ్‌మెంట్‌ కోసం యూజర్‌ ఇంటర్‌ఫేస్‌లో మార్పులు చేయనున్నారు. ఇప్పటివరకు పైభాగంలో ఉండే కాలింగ్ బటన్‌కి అప్‌డేషన్‌లో కిందికి రానుంది. ఇన్‌ఫో, ఆడియో, వీడియో, కెమెరా బటన్స్‌తో పాటు మెసేజింగ్‌ బటన్ కూడా రానుంది.

మరిన్ని యానిమేటెడ్‌ స్టిక్కర్లు: యూజర్ల కోసం మరిన్ని యానిమేటెడ్‌ స్టిక్కర్లు అందుబాటులోకి రానున్నాయి. సరదాగా ఉంటే మరిన్ని స్టిక్కర్లు వచ్చే అవకాశం ఉంది.

బిజినెస్ ఖాతా వారి కోసం: బిజినెస్ ఖాతా ఉన్న వారికి అదనపు ఫీచర్ అందుబాటులోకి రానుంది. పోర్టిఫోలియోకు షార్ట్‌కట్‌గా కాటలాగ్‌ ఫీచర్ రానుంది. ఈ యాప్‌లో అదనంగా మరో కొత్త కాల్‌బటన్‌ని కల్పించనుంది.

Read More:

ఎలాంటి ఇన్‌ఫెక్షన్ లేదు: ఎస్పీబీ ఆరోగ్యంపై చరణ్ వీడియో

ఆన్‌లైన్‌ క్లాసుల పరిస్థితి ఇదేనేమో.. వీడియో వైరల్‌