AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Delhi Rains: ఢిల్లీలో వడగళ్ల వాన భీభత్సం.. జన జీవనం అస్తవ్యస్తం.. మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం..

రోహిణీ కార్తిలో ఎండలు మండుతూ ఉండాల్సిన సమయంలో వర్షాలు పడుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో సహా దేశ రాజధాని ఢిల్లీలోనూ భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. గాలికి అనేక ప్రాంతాల్లో హోర్డింగ్‌లు విరిగిపడ్డాయి.వర్షం, గాలుల కారణంగా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ నిలిచిపోయింది. విజయ్‌చౌక్ దగ్గర వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది.

Delhi Rains: ఢిల్లీలో వడగళ్ల వాన భీభత్సం.. జన జీవనం అస్తవ్యస్తం.. మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం..
Weather Update
Surya Kala
|

Updated on: May 22, 2025 | 10:06 AM

Share

ఢిల్లీలో వడగళ్లతో కుంభవృష్టి కురిసింది. ముందుగా రెడ్‌ అలర్ట్ జారీ చేసినట్లుగా వరుణుడు విరుచుకుపడ్డాడు. ఈదురు గాలులతో కూడిన వర్షం, ఆ వెంబడే వడగళ్లు పడటంతో ఢిల్లీ, ఎన్‌సీఆర్‌లో పలు చోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. సఫ్దర్‌గంజ్ ఏరియాలో గంటకు 79 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయగా, సెంట్రల్ ఢిల్లీ, గోల్ మార్కెట్, లోడి రోడ్‌లో కూడా వడగండ్లు పడ్డాయి.

మెట్రో ట్రాక్‌పై చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి, విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఈదురు గాలులు, వడగళ్ల వాన కారణంగా మెట్రో రైల్ సేవలకు అంతరాయం ఏర్పడింది, ట్రైన్స్ ఆలస్యం నడిచాయి.

చురుగ్గా కదులుతున్న నైరుతి రుతుపవనాల కారణంగా తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా జోరు వానలు కురుస్తున్నాయి. అసోం రాష్ట్రంలోని గువహటిలో జోరు వానలు కురుస్తున్నాయి. రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి జనావాసాలు కాస్తా.. జలావాసాలుగా మారాయి.

ఇవి కూడా చదవండి

యూపీలోని గోరఖ్‌పూర్‌ను భారీ వర్షాలు ముంచెత్తాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.

నైరుతి రుతుపవనాలు మరో రెండు మూడు రోజుల్లో కేరళ తీరాన్ని తాకుతాయని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. వీటి ప్రభావంతో తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయంటోంది ఐఎండీ.

ఏపీ, తెలంగాణ, కర్నాటక, తమిళనాడు, కేరళ, ఒడిశాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయి. ఈదురుగాలులతో పాటు పిడుగులు కూడా పడే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరిస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే