Viral Video: ఇది కదా భారతీయ మహిళ శక్తి యుక్తులంటే.. ఎత్తిన కత్తి దించితే ఒట్టు.. అమేజింగ్ వీడియో మీకోసం..

|

Jun 18, 2021 | 4:44 PM

Viral Video: సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు సర్క్యూలేట్ అవుతుంటాయి. వాటిలో నవ్వు తెప్పించేవి, నిశ్చేష్ఠులను చేసేవి,..

Viral Video: ఇది కదా భారతీయ మహిళ శక్తి యుక్తులంటే.. ఎత్తిన కత్తి దించితే ఒట్టు.. అమేజింగ్ వీడియో మీకోసం..
Woman Power
Follow us on

Viral Video: సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు సర్క్యూలేట్ అవుతుంటాయి. వాటిలో నవ్వు తెప్పించేవి, నిశ్చేష్ఠులను చేసేవి, షాక్‌కు గురిచేసివి, హృదయ విదారకమైనవి, ఆశ్చర్యకరమైనవి ఇలా రకరకలా వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతుంటాయి. కొన్ని వీడియోలు చూస్తే మాత్రం మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంటుంది. అంత ఆసక్తికరంగా ఉంటాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

భారతదేశ మహిళ శక్తి సామర్థ్యాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఝాన్సీ రాణీ, రాణీ రుద్రమ దేవి వంటి ధీశాలీలు పుట్టిన గడ్డ భారతదేశం. దేశంలో ఇప్పటికీ వీరనారీలకు కొదవ లేదని చెప్పాల్సిందే. ఎంతో మంది విలు విద్యలో ప్రావీణ్యం పొందుతున్నారు. చాలా మంది మహిళలు, యువతులు కత్తిసాము, కర్రసాములో అపార ప్రతిభ కలిగి ఉన్నారు. తాజాగా ఓ మహిళ చీరకట్టులో చేసిన కర్రసాము, కత్తిసాము ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుంటుంది. మహిళ ప్రదర్శనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూస్తే కచ్చితంగా ఆశ్చర్యపోతారు

వైరల్ అవుతున్న ఈ వీడియోలో సంప్రదాయ వస్త్రధారణ కలిగిన ఓ స్త్రీ కత్తి సాము, కర్రసాము తో అందరినీ ఆశ్యర్యానికి గురిచేసింది. అసాధారణ రీతిలో కత్తిని, కర్రను తిప్పడం చూస్తే ఔరా అనాల్సిందే. మహిళ తొలుత కర్రను చేతపట్టిన మహిళ.. ఆపకుండా గాలిలో గిరగిరా తిప్పింది. కాసేపటి తరువాత.. కర్రను కింద పెట్టి కత్తి, బల్లెం చేతపట్టింది. కళ్లు చెదిరేలా కత్తిసాము చేసింది అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. మహిళ ఈ ప్రదర్శన చేస్తుండగా చుట్టూ పదుల సంఖ్యలో ప్రజలు గుమిగూడారు. ఆమె ప్రదర్శనను తెరిపారా చూశారు. కాగా, ఈ వీడియోను ఐపిఎస్ అధికారి రూపిన్ శర్మ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ‘అమేజింగ్ దేశీ మార్షల్ ఆర్స్ట్’ అని క్యాప్షన్ పెట్టారు. ఐపిఎస్ అధికారి ఆ వీడియోను షేర్ చేయడమే ఆలస్యం ఎంతో మంది నెటిజన్లు ఈ వీడియోపై స్పందించారు. మహిళ ప్రదర్శనను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వేల సంఖ్యలో వ్యూస్, లైక్స్ ఆ వీడియోకు వచ్చాయి. ఇంతలా ఆకట్టుకుంటున్న ఈ వీడియోను మీరూ చూసేయండి.

Viral Video:

Also read:

Fake seeds seized: రైతుల అవసరాలే అవకాశంగా మోసాలు.. అంతర్రాష్ట్ర నకిలీ విత్తనాల ముఠా అరెస్ట్.. రూ.6 కోట్ల నకిలీ విత్తనాలు సీజ్