ఘజియాబాద్, నవంబర్ 25: పార్కింగ్ విషయంలో తలెత్తిన వివాదం చిరిగి చిరిగి గాలివానగా మారింది. దీంతో పలువురు వ్యక్తులు ఓ యువకుడిని చితక్కొట్టారు. ఈ షాకింగ్ ఘటన ఆదివారం ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో చోటు చేసుకుంది. రోడ్డుపై యువకుడిని కొడుతున్న వీడియో దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వివరాల్లోకెళ్తే..
ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లోని గాంధీ నగర్ ప్రాంతంలో హరి మందిర్ చౌక్ సమీపంలో పార్కింగ్‌పై కొందరు యువకులు గొడపడ్డారు. పార్కింగ్ విషయంలో జరిగిన వాగ్వాదంలో మాటామాటీ పెరిగి చేయి చేసుకునే వారకు వెళ్లింది. దీంతో కొందరు వ్యక్తులు ఓ యువకుడిని దారుణంగా కొట్టిన వీడియో దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో బ్లూ కలర్ డెనిమ్ జాకెట్‌లో ఉన్న యువకుడిని ఆరుగురు వ్యక్తులు చేతులతో పిడిగుద్దులు గుద్దడం వీడియోలో కనిపిస్తుంది. వారిలో రెడ్ కలర్ షర్టు వ్యక్తి బాధిత యువకుడిని నేలపైకి తోసి కాళ్లతో కొట్టడం వీడియోలో చూడొచ్చొ. ఆ వ్యక్తి లేవడానికి ప్రయత్నించినప్పటికీ వారంతా అతని చుట్టూ చేరి కొట్టాడరు.
#Ghaziabad– गांधीनगर हरि मंदिर के पास युवाओं में जमकर हुई मारपीट, मारपीट के दौरान युवाओं ने एक दूसरे के ऊपर जमकर चलाए थप्पड़ कोहनी घूंसे, मारपीट का वीडियो हुआ सोशल मीडिया पर वायरल।@Uppolice @ghaziabadpolice #viralvideo #Trending #trendingvideo pic.twitter.com/k8wEWXXOYu
— विभोर अग्रवाल🇮🇳 (@IVibhorAggarwal) November 24, 2024
రోడ్డుపై ఇతర వాహనదారులు, స్థానికులు వారిని విడదీయడానికి ప్రయత్నించారు. అయితే బ్లూ కలర్ షర్టు వ్యక్తి మాత్రం రెచ్చిపోయి బాధిత యువకుడిని చితక్కొట్టడం వీడియోలో కనిపిస్తుంది. ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. సిహాని గేట్ పోలీసులు వీడియోలోని నిందితులను గాలించే పనిలో పడ్డారు. కాగా గత వారం ఇలాగే మరో సంఘటన జరిగింది. ఇదే సిటీలోని శంకర్ విహార్ ప్రాంతంలో ఒక ఇంటి వెలుపల మోటారుసైకిల్ పార్కింగ్ విషయంలో జరిగిన చిన్న వివాదం రెండు వర్గాల మధ్య ఘోరమైన ఘర్షణకు దారితీసింది. ఈ గొడవలో ఓ వ్యక్తిని కత్తితో పొడివడంతో తీవ్రంగా గాయపడ్డాడు.