భారత్ పొమ్మంది, అమెరికా రమ్మంది, మయన్మార్ దేశస్థులకు శరణమిచ్చిన బైడెన్ ప్రభుత్వం

మయన్మార్ లో సైనిక అధికారుల, పోలీసుల వేధింపులకు, అమానుషాలకు భయపడి భారత్ వంటి దేశాలకు రహస్యంగా పారిపోయి వస్తున్న ప్రజలను, పోలీసులను తాము ఆదుకుంటామని అమెరికా ప్రకటించింది.

భారత్ పొమ్మంది, అమెరికా రమ్మంది, మయన్మార్ దేశస్థులకు శరణమిచ్చిన బైడెన్ ప్రభుత్వం
Mayanmar
Follow us

| Edited By: Phani CH

Updated on: Mar 13, 2021 | 11:00 AM

మయన్మార్ లో సైనిక అధికారుల, పోలీసుల వేధింపులకు, అమానుషాలకు భయపడి భారత్ వంటి దేశాలకు రహస్యంగా పారిపోయి వస్తున్న ప్రజలను, పోలీసులను తాము ఆదుకుంటామని అమెరికా ప్రకటించింది. వారు తాత్కాలికంగా తమ దేశంలో శరణార్థులుగా ఉండవచ్చునని యూఎస్ హోమ్ లాండ్ సెక్యూరిటీ సెక్రటరీ అలెజాండ్రో మయోర్కస్  అంటున్నారు.  మయన్మార్ లో సైనిక పాలనకు వ్యతిరేకంగా ప్రజలు పెద్దఎత్తున నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. గత ఫిబ్రవరి 1 న ఆ దేశంలో ప్రజానేత ఆంగ్ సూకీ ని నిర్బంధంలోకి తీసుకుని, దేశంలో ఏడాది పాటు ఎమర్జెన్సీ విధిస్తు సైనిక పాలకులు అధికారాన్ని  తమ కైవసం చేసుకున్నారు. అప్పటి నుంచి ఇంచుమించు రోజూ దీనికి వ్యతిరేకంగా ప్రజలు భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. వీరిని చెదరగొట్టేందుకు, అణచివేసేందుకు పోలీసులు, సైన్యం వారిపై బాష్ప వాయు  ప్రయోగించడమే కాక, రబ్బర్ బులెట్లు, అసలైన తూటాలను వాడుతూ కాల్పులు జరుపుతున్నారు. . ఈ ఉద్రిక్త పరిస్థితుల్లో అనేకమంది మరణించడమో, గాయపడడంతో జరుగుతోంది. తమ పై అధికారుల ఆదేశాలను పాటించకుండా నిరాకరిస్తున్న పోలీసులు తమపై కఠిన చర్యలు తీసుకుంటారని భయపడి  భారత్ వంటి దేశాలకు పారిపోయి వస్తున్నారు. ఇటీవల 30 మంది పోలీసులు వారి కుటుంబాలు ఇలా రహస్యంగా రాత్రుళ్ళు మాత్రమే  ప్రయాణిస్తూ మిజోరం  చేరుకున్నారు.

అయితే వీరికి ఆశ్రయమిచ్చేందుకు హోమ్ శాఖ నిరాకరిస్తూ వారిని తిప్పి పంపివేయాలని మిజోరం అధికారులను ఆదేశించింది. దీంతో మయన్మార్ బాధితులకు దిక్కు తోచడంలేదు. కాగామయన్మార్ నుంచి భయపడి పారిపోయి వస్తున్న ప్రజలతో బాటు ఇలాంటివారికి కూడా తాత్కాలికంగా తాము ఆశ్రయమిస్తామని అమెరికా అంటోంది. వారికి ఈ హోదా కల్పిస్తామని అలెజాండ్రో వెల్లడించారు. మానవతా దృక్పథంతో తాము వీరికి ఆశ్రయం ఇస్తామని ఆయన చెప్పారు. తమ ప్రజానేత ఆంగ్ సాన్ సూకీని జైలు నుంచి విడుదల చేయాలని  కోరుతూ ఇప్పటికీ మయన్మార్ లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. మయన్మార్ పై పలు దేశాలు ఆంక్షలు విధించాయి కూడా.

మరిన్ని ఇక్కడ చదవండి:

Mehreen Kaur Engaged: ఘనంగా హీరోయిన్ మెహ్రీన్ నిశ్చితార్ధం.. నెట్టింట్లో వైరల్ అవుతున్న ఫోటోలు..

Uninstall Apps: మీ ఫోన్‌లో ఈ యాప్స్ ఉన్నాయా.? తస్మాత్ జాగ్రత్త.. వెంటనే డిలీట్ చేయండి.!