మెరిట్ విద్యార్థిని సుదీక్ష మృతి కేసు దర్యాప్తులో వేగం పెంచిన పోలీసులు

యూపీలో బులంద్ షహర్ జిల్లాకు చెందిన మెరిట్ విద్యార్థిని సుదీక్షా భాటి మృతికి సంబందించి యూపీ పోలీసులు తమ దర్యాప్తులో జోరు పెంచారు. 18 మోటారు సైకిళ్లను..

మెరిట్ విద్యార్థిని సుదీక్ష మృతి కేసు దర్యాప్తులో వేగం పెంచిన పోలీసులు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 12, 2020 | 5:16 PM

యూపీలో బులంద్ షహర్ జిల్లాకు చెందిన మెరిట్ విద్యార్థిని సుదీక్షా భాటి మృతికి సంబందించి యూపీ పోలీసులు తమ దర్యాప్తులో జోరు పెంచారు. 18 మోటారు సైకిళ్లను (రాయల్ ఎన్ ఫీల్డ్) వారు స్వాధీనం చేసుకున్నారు. అమెరికాలో చదువుకుంటూ ఈ మధ్యే భారత్ వచ్చిన సుదీక్ష..తన బంధువుతో కలిసి బైక్ పై వెళ్తుండగా ద్విచక్రవాహనాలపై కొందరు పోకిరీలు ఆమె వాహనాన్ని అడ్డగించి ఢీ కొట్టడంతో.. కిందపడిపోయి ఆమె మరణించింది. ఈ ఘటనపై ఔరంగాబాద్ పోలీసులు జిల్లా వ్యాప్తంగా గల బైక్ లపై దృష్టి సారించారు. విద్యార్థిని మృతికి కారకులైనవారిని అరెస్టు చేసేందుకు యత్నిస్తున్నారు. తమ కూతురిని ఇద్దరు పోకిరీలు బైక్ పై వెంబడిస్తూ వేధించారని సుదీక్ష కుటుంబం ఆరోపిస్తోంది.

అమెరికాలోని కళాశాలలో చదివేందుకు సుదీక్షకు రూ. 3.8 కోట్ల స్కాలర్ షిప్ లభించింది. టీ అమ్ముకుని జీవించే ఈమె తండ్రి తన కూతురి మరణానికి కారణమైనవారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. ఈ ఫ్యామిలీలోని అయిదుగురు పిల్లల్లో సుదీక్షే పెద్ద కూతురని తెలిసింది.