యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో అయోధ్య నుంచి సీఎం యోగి ఆదిత్యనాథ్ పోటీ ? అప్పుడే ఊహాగానాలు

వచ్చే ఏడాది జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం యోగి ఆదిత్యనాథ్ అయోధ్య నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారని ఊహాగానాలు ప్రారంభమయ్యాయి.

యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో అయోధ్య నుంచి సీఎం యోగి ఆదిత్యనాథ్ పోటీ ? అప్పుడే ఊహాగానాలు
Yogi Adityanath

వచ్చే ఏడాది జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం యోగి ఆదిత్యనాథ్ అయోధ్య నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారని ఊహాగానాలు ప్రారంభమయ్యాయి. ఇందుకు సిటింగ్ ఎమ్మెల్యే వేద్ ప్రకాష్ గుప్తా..తన ఈ సీటుకు రాజీనామా చేసేందుకు సంసిద్ధత ప్రకటించారు. ముఖ్యమంత్రి కోసం ఈ నియోజకవర్గానికి రాజీనామా చేస్తానని, ఆయన పోటీ చేయడం తనకు, ఈ నియోజకవర్గ ప్రజలందరికీ గర్వ కారణమని గుప్తా అన్నారు. ఎవరు, ఎక్కడి నుంచి పోటీ చేయాలో పార్టీ నిర్ణయిస్తుందని, అయితే ఈ నియోజకవర్గానికి ఆదిత్యనాథ్ ఇస్తున్న ప్రాధాన్యతల్లో ఒకటని ఆయన పేర్కొన్నారు. ఆదిత్యనాథ్ ఇక్కడి నుంచి పోటీ చేయదలిస్తే తాను, ఈ నియోజకవర్గ ప్రజలంతా ఆయన కోసం ప్రచారం చేస్తామన్నారు. యూపీలో మళ్ళీ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావాలన్నారు.అయితే ఈ ఊహాగానాలపై స్పందించిన కాంగ్రెస్ అధికార ప్రతినిధి సురేంద్ర రాజ్ పుత్.. సీఎం ఇక్కడి నుంచి పోటీ చేయాలనీ కోరుతున్న ఎమ్మెల్యేలు ఆయన గత నాలుగేళ్లుగా ఈ నియోజకవర్గానికి చేసిన కృషి ఏమిటో చెప్పాలన్నారు. ఎంతమందికి ఈ ముఖ్యమంత్రి ఉద్యోగాలు ఇచ్చారని, ఎన్ని గ్రామాలకు మంచినీటి సౌకర్యం కల్పించారని ఆయన ప్రశ్నించారు.

మహిళలపై ఎన్ని నేరాలు జరిగాయో…ప్రతి గ్రామంలో కోవిడ్ తో ఎంతమంది మరణించారో చెప్పాలన్నారు. సమాజ్ వాదీ పార్టీ అధికార ప్రతినిధి జుహీ సింగ్ కూడా ఇలాగే స్పందిస్తూ.. రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారిపోయాయని, మహిళలపై అత్యాచారాలు పెరిగిపోయాయని, ఇక నిరుద్యోగ సమస్య గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగిందని అన్నారు. అయోధ్య నుంచి ఈ సీఎం పోటీ చేసినా.. మరే నియోజకవర్గం నుంచి పోటీ చేసినా ప్రజలకు ఒరిగేదేముందని ఆయన ప్రశ్నించారు. మొదట ఈ సమస్యలన్నీ పరిష్కారం కావలసి ఉందన్నారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Thandava Reservoir : విశాఖ జిల్లా తాండవ రిజర్వాయర్ నుంచి ఆయకట్టుకు నీటి విడుదల

Nidhhi Agerwal: వాన పాటలు చూడటాన్నికి బాగుంటాయి..కానీ చేయడానికే చిరాకు అంటున్న ఇస్మార్ట్ బ్యూటీ

Click on your DTH Provider to Add TV9 Telugu