Uttarakhand చంద్రగ్రహణం నుంచి రోజూ మంటలు.. ఆ ఇంట్లో అసలేం జరగుతోంది.. మిస్టరీగా మారిన ఇన్సిడెంట్

ఆకాశంలో చంద్రగ్రహణం ఏర్పడిన సమయంలో ఆ ఇంట్లో మంటలు చెలరేగాయి. ఆగిపోతాయిలే అని భావిస్తే అవి మరింత విజృంభించాయి. ఇలా ఒక రోజు కాదు.. రెండు కోజులు కాదు.. ఏకంగా ఎనిమిది రోజులు ఇలాగే..

Uttarakhand చంద్రగ్రహణం నుంచి రోజూ మంటలు.. ఆ ఇంట్లో అసలేం జరగుతోంది.. మిస్టరీగా మారిన ఇన్సిడెంట్
Fire Accident
Follow us

|

Updated on: Nov 18, 2022 | 10:24 AM

ఆకాశంలో చంద్రగ్రహణం ఏర్పడిన సమయంలో ఆ ఇంట్లో మంటలు చెలరేగాయి. ఆగిపోతాయిలే అని భావిస్తే అవి మరింత విజృంభించాయి. ఇలా ఒక రోజు కాదు.. రెండు కోజులు కాదు.. ఏకంగా ఎనిమిది రోజులు ఇలాగే జరగడంతో ఆ ఇంట్లో ఉండే వాళ్లు భయంతో వణికిపోయారు. ఏం జరుగుతుందో.. ఎలా జరుగుతుందో తెలియక వారు తలలు పట్టుకున్నారు. ఇక చేసేదేమీ లేక ఆ ఇంటిని ఖాళీ చేసి మకాం మార్చారు. రక్షణ కోసం ఇద్దరు పోలీసుల సహాయ తీసుకున్నారు. అయినా వారు ఖాళీ చేసిన ఇంట్లో మంటలు వస్తుండడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన ఉత్తరాఖండ్ నైనిటాల్ జిల్లాలోని హల్ద్వానీలో జరిగుతోంది. ఈ నెల 8 న చంద్రగ్రహణం, భూకంపం సంభవించిన తర్వాతి నుంచి ఆ ఇంట్లో రోజూ మంటలు అంటుకుంటున్నాయి. షార్ట్ సర్క్యూట్ వల్ల ఇలా జరుగుతుందేమోనని పవర్ కనెక్షన్ కూడా తీయించారు. అయినా ఆ తర్వాత కూడా ఇంట్లోని ఎలక్ట్రిక్ బోర్డులు, వైర్లు కాలిపోతుండడంతో భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. బీరువాలోని దుస్తులు కాలిపోవడంతో ఏం జరుగుతుందో తెలియక వణికిపోతున్నారు.

హల్ద్వానీలోని మార్కెట్‌లో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సమీపంలో కమల్ పాండే నివాసముంటున్నారు. వారి రెండు అంతస్థుల భవనంలో అతని తమ్ముడి కుటుంబంతో కలిపి మొత్తం 9 మంది ఉంటున్నారు. అయితే.. నవంబరు 8 న చంద్రగ్రహణం తర్వాత సాయంత్రం ఏడు గంటలకు ఇంట్లో ఉన్న విద్యుత్ బోర్డులో మంటలు వచ్చాయి. వారు వెంటనే అలర్ట్ అయ్యి వాటిని ఆర్పివేశారు. ఎలక్ట్రీషియన్‌ను పిలిపించి బోర్డు సరి చేయించారు. అయినా ఆ తర్వాతి రోజూ వాష్ రూమ్ లోని ఎలక్ట్రిక్ బోర్డులో మంటలు అంటుకున్నాయి. దీంతో ఇక లాభం లేదని విద్యుత్ కనెక్షన్‌ను పూర్తిగా తొలగించారు. అయినా కూలర్‌లో మంటలు చెలరేగాయి. బీరువాలోని దుస్తులకు మంటలు అంటుకున్నాయి. దీంతో భయపడిపోయిన కమల్ కుంటుంబం తమ ఇంటి ముందున్న ఇంటిని అద్దెకు తీసుకుని అక్కడికి మకాం మార్చారు. రక్షణ కోసం ఇద్దరు సోదరులు అక్కడే పహారా కాసేవారు. అయినా ఆ తర్వాత కూడా మంటలు చెలరేగుండడం గమనార్హం.

Fire In House

Fire In House

విషయం తెలిసుకున్న సిటీ మేజిస్ట్రేట్ రిచా సింగ్.. పోలీసులతో కలిసి ఇంటిని తనిఖీ చేశారు. మంగళవారం చివరిసారిగా ఆ ఇంట్లో మంటలు వచ్చాయి. బుధవారం నుంచి మంటలు కనిపించలేదు. ఇంట్లో పదేపదే మంటలు చెలరేగుతుండడం వెనక ఏదైనా కుట్ర దాగి ఉండొచ్చని రిచా సింగ్ తెలిపారు. కాగా.. విషయం తెలిసుకున్న స్థానికులు ఈ వింతను చూసేందుకు ఎగబడుతున్నారు. కాలిన వస్తువులను చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. భూకంపం కారణంగా భూమి లోపల ఉండే వాయువుల లీకేజీ కారణంగా ఇలా జరుగుతుండొచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..