Students Attack: స్కూల్‌కి వచ్చేదేలే.. ఉపాధ్యాయులపై కత్తులతో దాడి చేసిన విద్యార్థులు.. ఎక్కడంటే..

|

Mar 20, 2022 | 11:43 AM

Students Attack on Teacher: తమిళనాడులో విద్యార్థులు వీథి రౌడీల్లా ప్రవర్తిస్తున్నారు. ఏకంగా తమకు చదువుచెప్పే టీచర్స్‌పైనే దాడికి తెగబడుతున్నారు. దీంతో విద్యార్థుల నుంచి తమను కాపాడాలంటూ కలెక్టర్‌కే మొర పెట్టుకున్నారు ఉపాధ్యాయులు.

Students Attack: స్కూల్‌కి వచ్చేదేలే.. ఉపాధ్యాయులపై కత్తులతో దాడి చేసిన విద్యార్థులు.. ఎక్కడంటే..
Students Attack Teacher At
Follow us on

తమిళనాడులో విద్యార్థులు(Students) వీథి రౌడీల్లా ప్రవర్తిస్తున్నారు. ఏకంగా తమకు చదువుచెప్పే టీచర్స్‌పైనే దాడికి తెగబడుతున్నారు. దీంతో విద్యార్థుల నుంచి తమను కాపాడాలంటూ కలెక్టర్‌కే మొర పెట్టుకున్నారు ఉపాధ్యాయులు. తమిళనాడులో టీచర్స్‌పై స్టూడెంట్స్‌ దాడుల ఘటన హాట్‌టాపిక్‌గా మారింది. జనరల్‌గా టీచర్స్‌ను చూస్తే స్టూడెంట్స్‌ భయ.. భక్తులతో ఉంటారు. సరిగ్గా చదవలేదనో.. ఏదైనా తప్పు చేస్తేనో.. తమను ఎక్కడ ఉపాధ్యాయుడు దండిస్తారోనని బెదిరిపోతుంటారు. కానీ తమిళనాడు తేని జిల్లాలో మాత్రం ఇందుకు రివర్స్‌ మారింది వ్యవహారం. మంచి చెప్పేందుకు ప్రయత్నిస్తే వారిపైనే దాడులకు తెగబడుతున్నారు. చదువులు చెప్పే ఉపాధ్యాయులపై దాడులకు దిగుతున్నారు. తమ సమస్య ఎవరితో చెప్పుకోవాలో తెలియని పరిస్థితి నెలకొంది అక్కడి టీచర్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మద్యం మత్తులో  పాఠశాలకు వచ్చిన ఆ విద్యార్థి పాఠశాలలో అసభ్యంగా ప్రవర్థించినట్లుగా సమాచారం. ప్రభుత్వ పాఠశాల మహిళా ఉపాధ్యాయురాలితో అనుచిత మాటలు కూడా మాట్లాడినట్లు తెలుస్తోంది. విద్యార్థిని మందలించినందుకు వరుసగా రెండో రోజు పాఠశాలకు వచ్చిన ఆ విద్యార్థికి మద్దతుగా అదే పట్టణానికి చెందిన మరికొందరు స్టూడెంట్స్ కూడా  ఉపాధ్యాయురాలిని కత్తితో బెదిరించారు.

ఇక్కడ ఒక్కే చోట కాకుండా తమిళనాడు జి.కల్లుపట్టిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కూడా విద్యార్థులు ఇదే విధంగా ఉపాధ్యాయులను బెదిరించారు. ఉత్త‌మ‌పాళ్యం విద్యా జిల్లా తేవరంలోని ఓ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గత కొద్దిరోజులుగా కొడవళ్లతో విద్యార్థులు ఉపాధ్యాయులను బెదిరించారు.

విద్యార్థులను చూసి ఉపాధ్యాయులే భయపడిపోతున్నారు. స్కూల్‌కు వెళ్లాలంటేనే హడలిపోతున్నారు. స్కూల్‌లో అల్లరి చేసినా, ఎందుకు స్కూల్‌కు రాలేదని అడిగితే ఇక అంతే సంగతులు. విద్యార్థులు తమపై కత్తులతో దాడి చేస్తున్నారంటూ నిరసనలకు దిగారు ఉపాధ్యాయులు. దేవనపట్టి గవర్నమెంట్‌ స్కూల్‌లో టీచర్స్‌పై స్టూడెంట్స్‌ వరుస దాడులకు పాల్పడుతున్నారంటూ ఉపాధ్యాయుల ఫెడరేషన్‌లో పిర్యాదు చేశారు.

అంతేకాదు. విద్యార్థుల నుంచి తమను కాపాడాలంటూ అందరూ కలిసి కలెక్టర్‌కు మొర పెట్టుకున్నారు. కలెక్టరేట్‌ ముందు ధర్నాకు దిగడంతో వారితో చర్చించిన కలెక్టర్‌..స్కూల్‌లో టీచర్స్‌పై దాడుల ఘటనలపై విచారణకు ఆదేశించారు.

ఇవి కూడా చదవండి:  Sunny Leone: కూతురు నిషాను పట్టించుకోవడం లేదని ఆరోపించిన ట్రోలర్లకు సన్నీలియోన్ కౌంటర్..

BP Control Tips: బీపీ అస్సలు రాకుండా ఉండాలంటే.. ముందు ఈ అలవాట్లకు దూరంగా ఉండండి..

Kidney Cure: నిలబడి నీళ్లు తాగుతున్నారా.. అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్లే.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు..