వైరస్ వంటి టెర్రరిజం.. పరోక్షంగా పాకిస్తాన్ పై మోదీ ధ్వజం

ప్రపంచ దేశాలు ఓ వైపు కరోనాపై పోరాడుతుండగా.. మరోవైపు కొంతమంది టెర్రరిజం, ఫేక్ న్యూస్, వక్రీకరించిన వీడియోలవంటి వాటితో ప్రమాదకరమైన వైరస్ లను వ్యాపింపజేస్తున్నారని ప్రధాని మోదీ మండిపడ్డారు...

వైరస్ వంటి టెర్రరిజం.. పరోక్షంగా పాకిస్తాన్ పై మోదీ ధ్వజం
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: May 05, 2020 | 10:22 AM

ప్రపంచ దేశాలు ఓ వైపు కరోనాపై పోరాడుతుండగా.. మరోవైపు కొంతమంది టెర్రరిజం, ఫేక్ న్యూస్, వక్రీకరించిన వీడియోలవంటి వాటితో ప్రమాదకరమైన వైరస్ లను వ్యాపింపజేస్తున్నారని ప్రధాని మోదీ మండిపడ్డారు. దేశాలను, మతాలను చీల్చేందుకు ఈ విధమైన యత్నాలకు పాల్పడుతున్నారని అన్నారు. ఇలా పాకిస్తాన్ గురించి నేరుగా ప్రస్తావించకుండా ఆయన.. ఆ దేశంపై నిప్పులు కక్కారు. అలీన దేశాల శిఖరాగ్ర సమావేశాన్ని ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీ ప్రసంగించారు. ఉగ్రవాద నిర్మూలనపై అలీన దేశాలు దృష్టి పెట్టాలని ఆయన కోరారు.

కరోనా మహమ్మారి ఇప్పటికే ప్రపంచ దేశాల్లో సుమారు రెండున్నర లక్షల మందిని పొట్టన బెట్టుకోగా.. దాదాపు 30 లక్షల మందికి పైగా ఈ వైరస్ కి గురయ్యారు. అటు-పాకిస్తాన్ లో ఉగ్రవాద కార్యకలాపాలు మళ్ళీ ఊపందుకుంటున్నాయి. జమ్మూ కాశ్మీర్ లోయలో కేవలం ఒక్క నెలలోనే డజనుకు పైగా జరిగిన ఎన్ కౌంటర్లలో 22 మంది భద్రతా దళాల జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ నెల 3 న అక్కడి హంద్వారా ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు సైనికాధికారులు సహా అయిదుగురు జవాన్లు మృతి చెందారు. ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. నిన్నటికి నిన్న ఇదే ప్రాంతంలో ఉగ్రవాదుల కాల్పుల్లో ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందారు. ఒక టెర్రరిస్టు మరణించాడు. పైగా తమ దేశంలో జైళ్లలో ఉన్న సుమారు యాభైమంది ఉగ్రవాదులను కరోనా సాకు చూపి పాకిస్తాన్ ప్రభుత్వం విడుదల చేసింది. వీరిలో లష్కరే తోయిబా అగ్రనేత కూడా ఉన్నాడు. గత వారం పాక్ సైన్యం పూంచ్ జిల్లాలోని కిర్ని, షాపూర్, మాన్ కోట్ సెక్టార్ల వద్ద కాల్పులకు దిగింది. పాక్ సూచనల మేరకే ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అవుతోందని, అందువల్లే జమ్మూ కాశ్మీర్లో హైస్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యాన్ని పునరుధ్ధరించడం లేదని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.

Latest Articles
టెస్టుల్లో టీమిండియా నంబర్ వన్ ర్యాంక్ గోవిందా! అందులో మాత్రం..
టెస్టుల్లో టీమిండియా నంబర్ వన్ ర్యాంక్ గోవిందా! అందులో మాత్రం..
భారత మార్కెట్లోకి మరో కొత్త ఫోన్‌.. మిడ్‌ రేంజ్‌ బడ్జెట్‌లోనే
భారత మార్కెట్లోకి మరో కొత్త ఫోన్‌.. మిడ్‌ రేంజ్‌ బడ్జెట్‌లోనే
రోహిత్ వేముల ఆత్మహత్య కేసులో కీలక మలుపు.. హైకోర్టు కీలక సూచన..
రోహిత్ వేముల ఆత్మహత్య కేసులో కీలక మలుపు.. హైకోర్టు కీలక సూచన..
'రోహిత్‌ వేముల దళితుడు కాదు.. ఈ కేసును మూసి వేస్తున్నాం' హైకోర్టు
'రోహిత్‌ వేముల దళితుడు కాదు.. ఈ కేసును మూసి వేస్తున్నాం' హైకోర్టు
అమెజాన్‌ సేల్‌లో బెస్ట్‌ డీల్స్‌ ఇవే.. రూ. 8వేలలోనే ఫోన్స్..
అమెజాన్‌ సేల్‌లో బెస్ట్‌ డీల్స్‌ ఇవే.. రూ. 8వేలలోనే ఫోన్స్..
ఓటీటీలోకి రాబోతున్న హారర్ మూవీ షైతాన్.. చూస్తే తడిసిపోవాల్సిందే
ఓటీటీలోకి రాబోతున్న హారర్ మూవీ షైతాన్.. చూస్తే తడిసిపోవాల్సిందే
ఏపీలో పెన్షన్ల పంపిణీపై పరేషాన్.. ఇంటి నుంచి బ్యాంకుకు వయా..
ఏపీలో పెన్షన్ల పంపిణీపై పరేషాన్.. ఇంటి నుంచి బ్యాంకుకు వయా..
మండే ఎండలకు బ్రేక్.. తెలంగాణకు వర్ష సూచన
మండే ఎండలకు బ్రేక్.. తెలంగాణకు వర్ష సూచన
పోటీకి సిద్ధమైంన జాన్వీ కపూర్‌.. దిశా పటాని..
పోటీకి సిద్ధమైంన జాన్వీ కపూర్‌.. దిశా పటాని..
శని వదలట్లేదుగా! టీ20 ప్రపంచకప్ అంపైర్ల లిస్టులో టీమిండియా విలన్
శని వదలట్లేదుగా! టీ20 ప్రపంచకప్ అంపైర్ల లిస్టులో టీమిండియా విలన్