నడిరోడ్డులో పారిశుద్ధ్య కార్మికురాలిపై అఘాయిత్యం.. వీడియో వైరల్‌తో కేసు నమోదు

|

Sep 07, 2024 | 9:15 AM

మధ్యప్రదేశ్‌లో మరో దారుణం వెలుగు చూసింది. కామంతో కళ్ళు మూసుకుపోయిన దుండగులు పారిశుద్ధ్య కార్మికురాలిని సైతం వదలలేదు. ఉజ్జయిని నగరంలో పారిశుధ్య కార్మికురాలిపై అఘాయిత్యానికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

నడిరోడ్డులో పారిశుద్ధ్య కార్మికురాలిపై అఘాయిత్యం.. వీడియో వైరల్‌తో కేసు నమోదు
Abducts And Molests
Follow us on

మధ్యప్రదేశ్‌లో మరో దారుణం వెలుగు చూసింది. కామంతో కళ్ళు మూసుకుపోయిన దుండగులు పారిశుద్ధ్య కార్మికురాలిని సైతం వదలలేదు. ఉజ్జయిని నగరంలో పారిశుధ్య కార్మికురాలిపై అఘాయిత్యానికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతుండటంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఉజ్జయిని నగరంలోని అగర్‌‌నక ప్రాంతంలో పారిశుద్ధ్య కార్మికురాలికి ఒక వ్యక్తి బలవంతంగా మద్యం తాగించి ఈ దారుణానికి పాల్పడ్డాడు. కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు ఈ ఘటనను వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియో వైరల్‌గా మారడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.రద్దీగా ఉండే రోడ్డు ఫుట్‌పాత్‌పై మహిళపై అత్యాచారం జరిగిన ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆమెపై అత్యాచారానికి ముందు రోడ్డు పక్కన ఉన్న షెల్టర్‌కు తీసుకెళ్లాడు. మహిళను బెదిరించి నిందితులు అక్కడి నుంచి పారిపోయినప్పటికీ ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేశారు. దీంతో పోలీసులు ఆరా తీశారు. చివరికి బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు లోకేశ్‌ను అరెస్టు చేశారు. అయితే పోలీసుల విచారరణలో అసలు విషయం బయటపడింది.

అయితే యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి, అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చి విచారించగా, లోకేశ్ నేరం చేసినట్లు అంగీకరించాడు. మహిళకు వైద్యపరీక్షలు నిర్వహించి, ఆ తర్వాత సెప్టెంబర్ 5వ తేదీ గురువారం కోర్టులో లోకేష్‌ను హాజరుపరిచారు. వీడియో తీసిన వ్యక్తుల కోసం గాలిస్తున్నట్లు కోత్వాలి ప్రాంత సిటీ ఎస్‌పి ప్రకాశ్‌ మిశ్రా తెలిపారు. ముగ్గురు నుంచి నలుగురు వ్యక్తులు ఈ ఘటనను వీడియో తీసి వైరల్‌ చేసినట్లు అనుమానిస్తున్నామన్నారు. వేర్వేరు ప్రాంతాలకు చెందిన వీరి కోసం గాలింపు నిర్వహిస్తున్నామని పోలీసులు చెప్పారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..