Elections 2024: బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయో చెప్పిన ప్రియాంక గాంధీ వాద్రా

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో సవాళ్ల పర్వం కొనసాగుతోంది. బీజేపీకి ఈసారి 400 సీట్లు ఖాయమని ప్రధాని మోదీ ఈశాన్య రాష్ట్రాల ప్రచారంలో మరోసారి స్పష్టం చేశారు. ఈవీఎంలతో కాకుండా , స్వేచ్చగా ఎన్నికలు నిర్వహిస్తే బీజేపీకి 180 కంటే తక్కువ సీట్లు వస్తాయని కౌంటరిచ్చారు ప్రియాంకాగాంధీ.

Elections 2024: బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయో చెప్పిన ప్రియాంక గాంధీ వాద్రా
Priyanka Gandhi Vadra - Rahul Gandhi
Follow us

|

Updated on: Apr 17, 2024 | 10:05 PM

ఈశాన్య రాష్ట్రాల్లో ప్రచారాన్ని హోరెత్తించారు ప్రధాని మోదీ. జనాల్లో కనిపిస్తున్న ఉత్సా,హం చూస్తుంటే జూన్‌ నాలుగున ఎలాంటి ఫలితం వస్తుందో స్పష్టంగా కనిపిస్తోందని మోదీ అన్నారు. అస్సాంలోని నల్‌బరిలో నిర్వహించిన సభలో ప్రధాని మోదీ మాట్లాడారు. ఈసారి బీజేపీ కూటమి కచ్చితంగా 400 సీట్లు సాధిస్తుందన్నారు.

నల్‌బరి సభకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయన్నారు మోదీ. దేశంలో తొలిసారి మూడు అంచెల్లో నిర్వహించిన సభ ఇదే అన్నారు మోదీ. జూన్‌ 4న వచ్చే ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి 400 సీట్లు ఖాయమన్నారు.  “దేశంలో తొలిసారి మూడు స్థాయిల్లో నిర్వహించిన సభ ఇదే అని చెప్పుకోవాలి. జూన్‌ 4న వచ్చే ఫలితాలను ఈ సభ ముందే సూచిస్తోంది. జూన్‌ 4వ తేదీన వచ్చే ఫలితాలను దేశ ప్రజలు చూస్తున్నారు. జూన్‌ 4వ తేదీన 400 సీట్లు బీజేపీకి కచ్చింతంగా వస్తాయి. మరోసారి మోదీ సర్కార్‌ ఖాయం” అని మోదీ పేర్కొన్నారు.

త్రిపుర రాజధాని అగర్తాలాలో ప్రచారం చేశారు మోదీ. రాష్ట్రంలో సీపీఎం, కాంగ్రెస్‌ కలిసి ద్వేష దుకాణాన్ని తెరిచాయని తీవ్ర విమర్శలు చేశారు. గతంలో త్రిపురను పాలించిన కమ్యూనిస్ట్‌ , కాంగ్రెస్‌ ప్రభుత్వాలు సర్వనాశనం చేశాయన్నారు. ఈశన్య రాష్ట్రాలను కాంగ్రెస్‌ లూటీ చేస్తే .. బీజేపీ ప్రభుత్వం అభివృద్ది చేస్తోందన్నారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉంటే మొబైల్‌ బిల్లులు నెలకు రూ.5000 వచ్చేదన్నారు మోదీ. విజువల్స్‌

అయితే బీజేపీ 400 సీట్లు వస్తాయన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలకు కాంగ్రెస్ నుంచి అదేస్థాయిలో కౌంటర్లు వచ్చాయి. ఈవీఎంల ట్యాంపరింగ్ జరగకుండా దేశంలో స్వేచ్ఛగా ఎన్నికలు జరిగితే బీజేపీకి 180కి మించి సీట్లు రావని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ అన్నారు. ఏ ఆధారంతో 400 సీట్లు గెలుస్తామని బీజేపీ చెప్తోందని ప్రశ్నించారు, వాళ్లు ఏమైనా జ్యోతిష్యులా అని నిలదీశారు. ఇప్పటికే ఏదో చేసి ఉంటారు కాబట్టి 400 సీట్లు సాధిస్తామని చెప్తున్నారని ప్రియాంక అన్నారు. “దేశంలో స్వేచ్చగా ఎన్నికలు నిర్వహిస్తే..ఈవీఎంలు లేకుండా ఎన్నికలు జరిపితే బీజేపీ 180 కంటే తక్కువ సీట్లు మాత్రమే వస్తాయని నేను కచ్చితంగా చెబుతున్నా” అని ప్రియాంక గాంధీ పేర్కొన్నారు.

బీజేపీ నేతలు నిరుద్యోగం, ధరల పెరుగుదల, రైతులు, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి మాట్లాడటం లేరని ప్రియాంక తెలిపారు. యూపీలోని షహరన్‌పూర్‌లో ప్రియాంక రోడ్ షో నిర్వహించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..