PM Modi: నెట్టింట చెక్కుచెదరని మోడీ క్రేజ్‌.. 2021లో ఎక్కువ మంది సెర్చ్‌ చేసింది మన ప్రధాని గురించే..

Most Searched Personality 2021: సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రాజకీయ నాయకుల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఒకరు. ప్రజలను ఉద్దేశించి ఎలాంటి మెసేజ్‌ ఇవ్వాలన్నా ప్రధాని సోషల్ మీడియానే ఎంచుకుంటారు. ఈ క్రమంలోనే..

PM Modi: నెట్టింట చెక్కుచెదరని మోడీ క్రేజ్‌.. 2021లో ఎక్కువ మంది సెర్చ్‌ చేసింది మన ప్రధాని గురించే..
Narenda Modi
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Dec 09, 2021 | 4:38 PM

Most Searched Personality 2021: సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రాజకీయ నాయకుల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఒకరు. ప్రజలను ఉద్దేశించి ఎలాంటి మెసేజ్‌ ఇవ్వాలన్నా ప్రధాని సోషల్ మీడియానే ఎంచుకుంటారు. ఈ క్రమంలోనే ఆయనకు ఫాలోవర్లు కూడా ఎక్కువగానే ఉన్నారని చెప్పాలి. ఇక ఇంటర్‌నెట్‌లో ఎక్కువగా సెర్చ్‌ చేసే భారతీయుల్లో ప్రధాని నరేంద్ర మోడీ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచారు. తాజాగా ప్రముఖ సెర్చ్‌ ఇంజన్‌ యాహూ ఈ విషయాన్ని తెలిపింది. 2021 ముగియనున్న నేపథ్యంలో దేశంలో ఎక్కువ మంది నెటిజన్లు వెతికిన వ్యక్తుల జాబితాను యాహూ ప్రకటించింది. ఈ జాబితాలో ప్రధాని నరేంద్ర మోడీ మొదటి స్థానంలో నిలిచారు.

ఇక మోడీ మొదటి స్థానంలో నిలవడం ఇదే తొలిసారి కాదు. 2017 నుంచి క్రమం తప్పకుండా ఫస్ట్‌ ప్లేస్‌లో (గతేడాది మాత్రం స్వల్ప తేడాతో దివంగత సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మొదటి స్థానంలో నిలిచారు) నిలుస్తూ వస్తుండడం విశేషం. దీంతో ఇది చూసిన ఆయన అభిమానులు.. చెక్కుచెదరని మోడీ క్రేజ్‌కు ఇదొక మంచి ఉదాహరణ అని చెబుతున్నారు.

ఇక యాహూ విడుదల చేసిన జాబితాలో టీమిండియా క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ రెండో స్థానంలో నిలిచారు. కోహ్లీ ఈ ఏడాది టీ20 ఫార్మట్‌లో కెప్టెన్సీ బాధ్యతల నుంచి పక్కకు తప్పుకున్న విషయం తెలిసిందే. ఇక వెస్ట్‌ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ మూడో స్థానంలో నిలిచారు. ఈ ఏడాదిలో జరిగిన వెస్ట్‌ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తృణముల్‌ కాంగ్రెస్‌ విజయం సాధించడంతో దీదీ మరోసారి సీఎంగా ఎన్నికయ్యారు. ఇక ఇటీవల గుండె పోటుతో హఠాన్మరణం పొందిన బాలీవుడ్‌ ప్రముఖ టీవీ యాక్టర్‌ సిద్ధార్థ్‌ శుక్లా నాలుగో స్థానంలో ఉన్నారు. ఇక డ్రగ్స్‌ కేసులో అరెస్ట్‌ అయి, అనంతరం విడుదలైన షారుఖ్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యాన్‌ ఖాన్‌ ఈ ఏడాది ఎక్కువ సెర్చ్‌ చేసిన వారి జాబితాలో 7వ స్థానంలో నిలిచారు.

Also Read: Chiranjeevi: హైదరాబాద్‌లో ప్రారంభమైన మెగా154 షూటింగ్‌.. సెట్‌లో అడుగుపెట్టిన చిరంజీవి..

Shilpa Cheating Case: శిల్పా చౌదరి చీటింగ్ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు.. పోలీసుల విచారణలో మరెన్ని తేలేనో..!

Cyber Crime: ఎస్‌బీఐ ఫేక్ కాల్‌ సెంటర్‌తో ఫ్రాడ్‌.. వివరాలు చెప్పారో సమర్పయామి అనాల్సిందే..!