వారానికి ఒక్క రోజే పని.. 6 రోజులు విశ్రాంతి.. పోలీసుల విచారణలో విస్తుపోయే విషయాలు!

వారానికి ఒక్క రోజు విశ్రాంతి దొరకడమే గగనంగా మారిన రోజులు ఇవి. కేంద్ర ప్రభుత్వ విభాగాలు, కొన్ని పబ్లిక్ సెక్టార్ కంపెనీలు, ఐటీ పరిశ్రమలో మాత్రమే వారానికి 2 రోజుల విరామం ఉంటుంది. మరికొన్ని మల్టీనేషనల్ కంపెనీలు ఇంకో అడుగు ముందుకేసి వారంలో 4 రోజులు పని, 3 రోజుల విరామం అందిస్తున్నాయి. ఇంతకు మించి ప్రపంచంలో మరెక్కడా విరామం వెసులుబాటు లేదు.

వారానికి ఒక్క రోజే పని.. 6 రోజులు విశ్రాంతి.. పోలీసుల విచారణలో విస్తుపోయే విషయాలు!
Flight
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Jul 12, 2024 | 7:10 PM

వారానికి ఒక్క రోజు విశ్రాంతి దొరకడమే గగనంగా మారిన రోజులు ఇవి. కేంద్ర ప్రభుత్వ విభాగాలు, కొన్ని పబ్లిక్ సెక్టార్ కంపెనీలు, ఐటీ పరిశ్రమలో మాత్రమే వారానికి 2 రోజుల విరామం ఉంటుంది. మరికొన్ని మల్టీనేషనల్ కంపెనీలు ఇంకో అడుగు ముందుకేసి వారంలో 4 రోజులు పని, 3 రోజుల విరామం అందిస్తున్నాయి. ఇంతకు మించి ప్రపంచంలో మరెక్కడా విరామం వెసులుబాటు లేదు. కానీ ఉత్తర్ ప్రదేశ్‌లోని మీరట్‌లో వారికి వారంలో ఒక రోజు మాత్రమే పని. మిగతా 6 రోజులు విశ్రాంతి. అది కూడా తామున్న చోటకు 1,500 కి.మీ దూరంలో ఉన్న ప్రదేశానికి ఉదయం విమానంలో వెళ్లి, సాయంత్రానికి మళ్లీ విమానంలోనే తిరిగొచ్చేస్తారు. ఇంత దర్జా వెలగబెట్టే ఉద్యోగం ఏంటా అనుకుంటున్నారా? అక్కడికే వద్దాం.

ముంబై మహానగరంలో ఈ మధ్య ప్రయాణికులను నిలువు దోపిడీ చేస్తున్న ఘటనలు పెరిగిపోయాయి. ఈ దోపిడీ ముఠా ఒక ప్రత్యేక శైలిలో ఈ నేరాలకు పాల్పడుతోంది. తోటి ప్రయాణికుల మాదిరిగా మాట కలిపుతారు. చనువు తీసుకుని టీ-కాఫీ వంటి పానీయాలను ఆఫర్ చేస్తారు. ఎదుటి వారికి నమ్మకం కల్గించేందుకు వారు కూడా తీసుకుంటారు. కానీ మాయచేసి క్షణాల్లో మత్తుమందు కలిపేస్తారు. ప్రయాణికులు మత్తులోకి జారుకోగానే, వారి దగ్గరున్న విలువైన ఆభరణాలు, వస్తువులు స్వాహా చేసి దిగిపోతారు. ముంబైలోని బస్సుల్లో, లోకల్ రైళ్లలో ఈ తరహా దోపిడీలు జరుగుతున్నాయి. అయితే ఇవి వారానికి ఒక రోజు మాత్రమే జరుగుతున్నట్టు పోలీసులు గుర్తించారు.

మాతుంగా పోలీస్ స్టేషన్ పరిధిలో డబుల్ డెక్కర్ బస్సులో ఓ మహిళను ఇలాగే దోచుకున్న ఘటన వెలుగు చూసింది. ఆ కేసులో విచారణ చేపట్టిన పోలీసులు తమకు దొరికి తీగ లాగితే.. ఉత్తర్‌ ప్రదేశ్‌లోని మీరట్‌లో డొంక కదిలింది. ఢిల్లీ సమీపంలోని మీరట్‌లో ఉండే ఓ ముఠా.. వారానికి ఒక రోజు ఈ దోపిడీ ఆపరేషన్ చేపడుతున్నట్టు గుర్తించారు. మీరట్‌లోని షహనత్తన్‌కు చెందిన యూనస్‌ను అరెస్టు చేసి, అతని సహచరుల కోసం బ్రహ్మపురిలో సోదాలు జరిపారు. అయితే అప్పటికే మిగతా నిందితులు పారిపోయారు. పరారీలో ఉన్నవారి కోసం గాలింపు మొదలుపెట్టారు.

ఉదయం వస్తారు, సాయంత్రం వెళ్తారు

ఈ ముఠా మీరట్‌ నుంచి తెల్లవారు జామున బయలుదేరి ఢిల్లీ చేరుకుంటారు. అక్కణ్ణుంచి విమానంలో ముంబై చేరుకుంటారు. బంగారం ఎక్కువగా ధరించిన మహిళలను టార్గెట్ చేసి దోచుకుంటారు. ఆ వెంటనే మళ్లీ ముంబై విమానాశ్రయానికి వచ్చి ఢిల్లీకి తిరుగు ప్రయాణం అవుతారు. ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి కారులోనే మీరట్‌కు చేరుకుంటారు. ఇదంతా ఉదయం నుంచి రాత్రి వరకు జరిగే దినచర్య. అది కూడా వారంలో ఒక్క రోజే. మరో 6 రోజులు విశ్రాంతి తీసుకుని, మళ్లీ తమ దోపిడీ ఆపరేషన్ మొదలుపెడతారు. అంటే వారంలో ఒక రోజు మీరట్‌కు 1,500 కి.మీ దూరంలో ఉన్న ముంబైలో ‘పని’చేసి తిరిగొస్తారన్న మాట. ముంబై పోలీస్ విభాగంలోని సంతోష్ మాలిక్ ఇప్పుడు ఈ గ్యాంగ్‌ను వేటాడుతున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్