
సోషల్ మీడియాలో తరచూ వైరల్‌గా మారే కొన్ని సంఘటనలు ఎప్పటికప్పుడూ జనాలను ఆశ్చర్యానికి, భయాందోళనకు గురిచేస్తూ ఉంటాయి. తాజాగా అలాంటి ఒక సంఘటనే ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో నదిలో స్నానం చేసేందుకు వచ్చిన ఒక మహిళను మొసలి లాక్కెళ్తున్న దృశ్యాలను మనం చూడవచ్చు. అక్కడే ఉన్న కొందరు స్థానికులు మహిళను కాపాడే ప్రయత్నం చేసినా ఎలాంటి ఫలితం లేకపోయింది. అప్పటికే ఆ మొసలి మహిళను నది మధ్యలోకి లాక్కొని వెళ్లింది.
వివరాల్లోకి వెళ్తే.. జాజ్‌పూర్ జిల్లాలోని కాంతియా గ్రామంలో సోమవారం మధ్యాహ్నం ఈ సంఘటన వెలుగు చూసింది. స్థానికంగా నివసిస్తున్న 57 ఏళ్ల సౌదామిని అనే మహిళ గ్రామ సమీపంలో ఉన్న నదిలో స్నానం చేసేందుకు వెళ్లింది. నీటిలో దిగి స్నానం చేస్తుండగా.. ఒక్కసారిగా దూసుకొచ్చిన మొసలి ఆమెపై దాడికి దిగింది. ఆమె చేతిని పట్టుకొని నదిలోకి లాక్కెళ్లింది. అది గమినించిన కొందరు స్థానికులు నది దగ్గరకు చేరుకునేలోపే ఆ మొసలి ఆమెను నది మధ్యలోకి లాక్కెళ్లింది. ఇక చేసేదేమి లేక స్థానికులు చూస్తూ ఉండిపోయారు.
అయితే మహిళను మొసలి లాక్కెళ్తున్న దృశ్యాలను అక్కడున్న స్థానికులు సెల్‌ఫోన్‌లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఇదందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ విషయం తెలిసిన స్థానికులు భయంతో వణికిపోతున్నారు. ఆ నదివైపు వెళ్లాలంటే భయపడుతున్నారు. ఇక స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ డిపార్ట్మెంట్, పోలీసులు మహిళ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
A live video went viral from Jajpur, Bari area, where a crocodile dragging a waman in to the river, pubil getting panic after watching video #odisha #jajour #crocodile #news #viral #live pic.twitter.com/J1lR1k01D2
— Ajay kumar nath (@ajaynath550) October 7, 2025
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.