Maharashtra – Jharkhand Elections 2024: మరో సమరం.. మహారాష్ట్ర, జార్ఖండ్‌ ఎన్నికల తేదీలు ఇవే..

మహారాష్ట్ర, జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి భారత ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది.. మహారాష్ట్రలో 288, జార్ఖండ్ 81 అసెంబ్లీ స్థానాలున్నాయి. మహారాష్ట్రలో ఒకే విడతలో ఎన్నికలు జరగనుండగా.. జార్ఖండ్ లో రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి.. వీటితో పాటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలను కూడా నిర్వహించనున్నట్లు ఈసీ వెల్లడించింది.

Maharashtra - Jharkhand Elections 2024: మరో సమరం.. మహారాష్ట్ర, జార్ఖండ్‌ ఎన్నికల తేదీలు ఇవే..
Maharashtra – Jharkhand Elections 2024
Follow us

|

Updated on: Oct 15, 2024 | 4:59 PM

మహారాష్ట్ర, జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి భారత ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది.. మహారాష్ట్రలో 288, జార్ఖండ్ 81 అసెంబ్లీ స్థానాలున్నాయి. మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు జరుగుతాయని.. ఈసీ ప్రకటించింది.. నవంబర్‌ 20న మహారాష్ట్ర ఎన్నికలు జరగనుండగా.. 23న ఫలితాలు వెల్లడికానున్నాయి.. నవంబర్‌ 26తో మహారాష్ట్ర అసెంబ్లీ గడువు ముగియనుంది.. దీంతో ఈసీ ఎన్నికల తేదీలను ప్రకటించింది. ఈ నెల 22న మహారాష్ట్ర ఎన్నికల నోటిఫికేషన్.. ఈ నెల 29 వరకు నామినేషన్ల స్వీకరణ.. నామినేషన్ల ఉపసంహరణకు గడువు నవంబర్ 4 గా ప్రకటించింది..

జార్ఖండ్ లో రెండు దశల్లో ఎన్నికలు..

అంతేకాకుండా.. జార్ఖండ్‌ ఎన్నికలు రెండు దశల్లో జరుగుతాయని ఎన్నికల సంఘం వెల్లడించింది. నవంబర్ 13, 20న జార్ఖండ్‌ ఎన్నికలు, 23న ఫలితాలు వెలువడనున్నాయి.. నవంబర్‌ 13న 43 స్థానాలకు ఎన్నికలు, నవంబర్‌ 20న 38 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయని ఎన్నికల సంఘం తెలిపింది.

వీడియో చూడండి..

ఉప ఎన్నికలు..

మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలతోపాటు.. దేశ వ్యాప్తంగా ఉప ఎన్నికల షెడ్యూల్‌ ను కూడా ఎన్నికల సంఘం విడుదల చేసింది. మొత్తం 48 అసెంబ్లీ, 2 ఎంపీ స్థానాలకు ఉపఎన్నికలు జరగనున్నాయి.. నవంబర్ 13న 47 అసెంబ్లీ, 1 ఎంపీ స్థానానికి ఉపఎన్నిక జరగనుంది.. నవంబర్‌ 20న ఒక అసెంబ్లీ, ఎంపీ స్థానానికి ఉపఎన్నిక జరగనుంది.. నవంబర్‌ 23న ఉప ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి..

లైవ్ వీడియో చూడండి…

వీడియోస్ లీక్ చేస్తా.. అనన్యకు స్టార్ హీరో కొడుకు బెదిరింపులు.!
వీడియోస్ లీక్ చేస్తా.. అనన్యకు స్టార్ హీరో కొడుకు బెదిరింపులు.!
అభిమానులకు షాకిచ్చిన స్టార్ హీరో.. బిగ్‏బాస్ ‏కు ఇక గుడ్ బై.!
అభిమానులకు షాకిచ్చిన స్టార్ హీరో.. బిగ్‏బాస్ ‏కు ఇక గుడ్ బై.!
ఆసుపత్రిలో పడి ఉంటే.. ఎవరూ పట్టించుకోలేదు.! చలాకి చంటి ఎమోషనల్
ఆసుపత్రిలో పడి ఉంటే.. ఎవరూ పట్టించుకోలేదు.! చలాకి చంటి ఎమోషనల్
అబ్బో.. ఏకంగా రూ.12 లక్షలు సంపాదించేసిందిగా.!
అబ్బో.. ఏకంగా రూ.12 లక్షలు సంపాదించేసిందిగా.!
చుట్టుముట్టిన అనారోగ్య సమస్యలు? కట్ చేస్తే.. ఇలా మారిపోయిన స్టార్
చుట్టుముట్టిన అనారోగ్య సమస్యలు? కట్ చేస్తే.. ఇలా మారిపోయిన స్టార్
ఆ ఊరిపై పాములు పగబట్టాయా.? ఎక్కడ చూసినా గుట్టలు గుట్టలుగా పాములే.
ఆ ఊరిపై పాములు పగబట్టాయా.? ఎక్కడ చూసినా గుట్టలు గుట్టలుగా పాములే.
వీడిని కొడుకు అంటారా.? తండ్రిని భిక్షమెత్తుకునేలా చేసిన వ్యక్తి..
వీడిని కొడుకు అంటారా.? తండ్రిని భిక్షమెత్తుకునేలా చేసిన వ్యక్తి..
గుడిలో శ్లోకాలు చదువుతున్న మహిళలు.. చేతివాటం చూపించిన దొంగ
గుడిలో శ్లోకాలు చదువుతున్న మహిళలు.. చేతివాటం చూపించిన దొంగ
దూసుకొస్తున్న తుఫాన్.. ఏపీకి మరో గండం
దూసుకొస్తున్న తుఫాన్.. ఏపీకి మరో గండం
తీవ్ర విషాదం.. దాహం తీర్చాల్సిన నీరే.. ప్రాణం తీసింది.. ఎక్కడంటే
తీవ్ర విషాదం.. దాహం తీర్చాల్సిన నీరే.. ప్రాణం తీసింది.. ఎక్కడంటే