మడ అడవుల వల్ల ఉపయోగం ఇదే..!

TV9 Telugu

15 October 2024

తుఫానులు, సునామీల వంటివి వచ్చినప్పుడు మనిషి ఆపలేని సముద్ర విలయాన్ని తీరంలో ఉండే మడ ఆడవులు అడ్డుకుంటాయి.

పోటు మీద ఉన్న సముద్రనికి మడ అడవులు అడ్డు రావడంతో చిన్న కెరటాల్లా మారిపోయి ఉప్పెన ఆగిపోతుందని నిపుణులు చెబుతున్నారు.

ఉప్పెనని తగ్గించడంలో కీలకమైన మడ అడవుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడుకోవాలని పర్యావరణ ప్రియులు కోరుతున్నారు.

ప్రపంచవ్యాప్తంగా మడ అడవులు 2021 నాటికి 1.36 లక్షల చదరపు కిలోమీటర్ల మేర విస్తరించాయి. వీటి విస్తీర్ణంలో 20 శాతానికిపైగా ఇండొనేసియాలోనే ఉన్నాయి.

భారత్‌లో మడ అడవులు విస్తీర్ణ సుమారు 5000 చదరపు కిలోమీటర్లు. పశ్చిమ బెంగాల్‌లోని సుందర్‌బన్స్‌ మడ అడవులకు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు.

సుందర్‌బన్స్‌ మడ అడవులు రాయల్‌ బెంగాల్‌ పులులు, ఆలివ్‌ రిడ్లే తాబేళ్లు, నునుపు రోమపు నీటిపిల్లులు వంటి ఎన్నో జంతువులకు నెలవు.

ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 580 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో- ప్రధానంగా గోదావరి, కృష్ణానదీ ముఖద్వార ప్రాంతాల్లో మడ అడవులు.

మరక పిల్లి (ఫిషింగ్‌ క్యాట్‌) ఉనికి ఆరోగ్యకరమైన, నాణ్యమైన మడ ఆవరణ వ్యవస్థకు సంకేతంగా భావిస్తారు నిపుణులు.