15 October 2024

ఆ హీరో సినిమా నుంచి శ్రుతి హాసన్ తప్పుకుందా..? అసలేం జరిగింది.. 

Rajitha Chanti

Pic credit - Instagram

కమల్ హాసన్ నటవారసురాలిగా సినీరంగంలోకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది హీరోయిన్ శ్రుతి హాసన్.

మొదట్లో గాయనిగా తన టాలెంట్ నిరూపించుకున్న ఈ అమ్మడు ఆ తర్వాత హీరోయిన్‏గా సత్తా చాటి టాప్ హీరోయిన్‏గా మారింది.

తెలుగు, తమిళం, హిందీలో వరుస సినిమాలు చేసిన ఈ బ్యూటీ కొద్ది రోజులుగా సైలెంట్ అయ్యింది. నెట్టింట కూడా పోస్టింగ్స్ తగ్గించేసింది. 

ప్రస్తుతం శ్రుతి చేతిలో కేవలం ఒక్క సినిమా మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. అదే డెకాయిట్. అడవి శేష్ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. 

 ప్రముఖ సినిమాటోగ్రాఫర్ షనైల్ డియో తొలిసారిగా ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది. 

ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్ ఆకట్టుకున్నాయి. లవ్, యాక్షన్, డ్రామాగా వస్తున్న ఈ సినిమా నుంచి శ్రుతి తప్పుకున్నారని ప్రచారం సాగుతుంది. 

డేట్స్ ఇష్యూ వల్ల శ్రుతి హాసన్ ఈ డెకాయిట్ ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చిందని టాక్ వినిపిస్తుంది. ఇందుకు సంబంధించి ఎలాంటి ప్రకటన రాలేదు. 

డైరెక్టర్ షనైల్ డియో తన ఫ్యామిలీలో మెడికల్ ఎమర్జెన్సీ రావడంతో అమెరికాకు వెళ్లారట. దీంతో డేట్స్ వాయిదా పడడంతో శ్రుతి తప్పుకున్నారట.