వీటితో పొట్ట ఆరోగ్యం పరేషాన్..
Narender Vaitla
14 October
2024
మునగాకును క్రమంతప్పకుండా తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దీంతో జలుబు, దగ్గులాంటివి దరి చేరవని నిపుణులు చెబుతున్నారు.
బరువు తగ్గాలనుకునే వారు మునగాకును ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని ఫైబర్ కంటెంట్ త్వరగా కడుపు నిండిన భావన కలుగుతుంది.
రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో మునగాకు కీలకపాత్ర పోషిస్తుంది. దీంతో డయాబెటిస్ పేషెంట్స్ కచ్చితంగా వీటిని తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
మునగలో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మ ఆరోగ్యాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తుంది. చర్మ సంబంధిత సమస్యలు దరిచేరకుండా ఉంటాయి.
మునగాకులోని అమైనో ఆమ్లాలు ప్రొటీన్ ఉత్పత్తికి తోడ్పతాయి. ఇది జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. దీంతో మలబద్ధకాన్ని నివారిస్తుంది. కడుపులోని పుండ్లు, ఇన్‌ఫెక్షన్లను తగ్గిస్తుంది.
థైరాయిడ్ సమస్యతో బాధపడేవారు మునగాకును తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇందులోని ఔషధ గుణాలు థైరాయిడ్‌ను కంట్రోల్‌లో ఉంచేలా చేస్తుంది.
గర్భిణులు, బాలింతలు మునగను క్రమంతప్పకుండా తీసుకోవాలి. ఇందులోని కాల్షియం, ఐరన్, విటమిన్లు మేలు చేస్తాయి.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.
ఇక్కడ క్లిక్ చేయండి..