నవరాత్రుల్లో ఆన్‌లైన్‌లో అత్యధికంగా అమ్ముడైంది ఈ వస్తువే!

TV9 Telugu

15 October 2024

త్వరిత వాణిజ్య ప్లాట్‌ఫారమ్‌ (ఇన్‌స్టంట్-కామర్స్)లలో Blinkit, Zepto ప్రముఖమైనవి. వీటిలో చాలామంది నిత్యావసర వస్తువులను ఆర్డర్ చేస్తారు.

ఈ నవరాత్రుల్లో వీటిలో ఇతర వస్తువులతో పాటు, ప్రజలు మరో ప్రత్యేకమైన వస్తువును భారీగా కొనుగోళ్లు చేశారు.

Zepto సహ వ్యవస్థాపకుడు, CEO ఆదిత్ పాలిచా లింక్డ్‌ఇన్‌లో పోస్ట్ చేయడం ద్వారా వెల్లడి. ఆదిత్ తన పోస్ట్‌పై చాలా గ్రాఫిక్స్ కూడా షేర్ చేశాడు.

ఈ నవరాత్రులలో తమ ప్లాట్‌ఫారమ్ ద్వారా వివిధ వస్తువుల అమ్మకాలు ఎలా ఉన్నాయో ఇందులో పేర్కొన్నారు zepto CEO.

ఈ నవరాత్రిలో లక్షకు పైగా దాండియా కర్రలు అమ్ముడయ్యాయి. రెండో గ్రాఫిక్‌లో ఈసారి నవరాత్రులలో వాడే ఆహార పదార్థాలు ఎంత పెరిగాయో అదిత్ వెల్లడించారు.

ఉపవాస సమయంలో తినే చిప్స్ అమ్మకాలలో అతిపెద్ద పెరుగుదల. గతేడాదితో పోలిస్తే ఈసారి 16 రెట్లు పెరిగింది. దీని తరువాత బుక్వీట్, రాజగిరి పిండి ఉన్నాయి.

ఇప్పటి వరకు, మార్కెట్లో ఉన్న క్విక్ ప్లాట్‌ఫారమ్‌లో బ్లింకిట్ అతిపెద్ద వాటా. ఒక అంచనా ప్రకారం, ఇన్‌స్టంట్-కామర్స్ మార్కెట్‌లో Blinkit దాదాపు 45 శాతం ఆక్రమించింది.

దీని తర్వాత Swiggy వస్తుంది. స్విగ్గీ వాటా 27 శాతం. జెప్టో 21 శాతం షేర్‌తో మూడో స్థానంలో ఉంది. మిగిలిన భాగం ఇతర ఇన్‌స్టంట్-కామర్స్ కంపెనీలు ఉన్నాయి.