Maharashtra: అప్పుడే బీజేపీలో చేరిన మాజీ సీఎం.. ఒక్క మాటతో అందరినీ నవ్వులు పూయించారు.. ఎమన్నారంటే..?
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ కాంగ్రెస్ వీడి కాషాయం గూటికి చేరారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో బీజేపీలో చేరారు. కాంగ్రెస్‌లో 38 ఏళ్ల పదవీకాలం తర్వాత బీజేపీలో చేరిన కొద్దిసేపటికే, వేదికపై మాట్లాడుతున్న అశోక్ చవాన్ స్లిప్ అయ్యారు
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ కాంగ్రెస్ వీడి కాషాయం గూటికి చేరారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో బీజేపీలో చేరారు. కాంగ్రెస్‌లో 38 ఏళ్ల పదవీకాలం తర్వాత బీజేపీలో చేరిన కొద్దిసేపటికే, వేదికపై మాట్లాడుతున్న అశోక్ చవాన్ స్లిప్ అయ్యారు. అశోక్ చవాన్ ముంబై బీజేపీ చీఫ్ ఆశిష్ షెలార్‌ను “ముంబయి కాంగ్రెస్ అధ్యక్షుడు” అని పొరపాటుగా పిలిచారు. దీంతో డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో సహా అక్కడున్న వారంతా ఒక్కసారిగా నవ్వుకున్నారు. ముంబైలో బీజేపీలో చేరిన అనంతరం చవాన్ మీడియాతో మాట్లాడుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గట్టిగా నవ్వే ముందు సర్దిచెప్పడం కనిపించింది. చేసిన తప్పుకు క్షమాపణలు చెప్పిన చవాన్.. ‘ఇప్పుడే బీజేపీలో చేరాను.. అందుకే తప్పు చేశాను.. 38 ఏళ్ల కాంగ్రెస్‌లో ఉన్న తర్వాత బీజేపీలో చేరి కొత్త ప్రయాణం ప్రారంభిస్తున్నాను’ అంటూ చవాన్ చమత్కారంతో తప్పును సర్ధి చెప్పుకున్నారు.
VIDEO | Former Maharashtra CM Ashok Chavan mistakenly addressed #Mumbai BJP chief Ashish Shelar as Mumbai Congress chief triggering a laughter from Deputy CM Devendra Fadnavis and others. The incident happened as Chavan addressed the media after joining the BJP earlier today in… pic.twitter.com/Em0VWSRsgy
— Press Trust of India (@PTI_News) February 13, 2024
తాను ఎల్లప్పుడూ సానుకూల రాజకీయాలలో భాగంగా ఉంటానని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకువస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీజేపీలో చేరుకున్నట్లు ప్రకటించారు అశోక్ చవాన్. ‘సబ్కా సాథ్, సబ్కా వికాస్’ అంటూ ప్రతిజ్ఞ చేశారు. కొన్నిసార్లు మోదీని వ్యతిరేకించలేదని ఆరోపణలు వచ్చాయి. కానీ ఎప్పుడూ సానుకూల రాజకీయాలు చేశాను. అంటూ చెప్పుకొచ్చారు.
ఈ సందర్భంగా దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ అశోక్ చవాన్‌పై ప్రశంసలు కురిపించారు. మహారాష్ట్ర రాష్ట్రంలో సీనియర్ నాయకత్వం బీజేపీలోకి చేరుతోంది. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలిచారు. వివిధ మంత్రి పదవులు నిర్వహించి రెండు సార్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన అశోక్ చవాన్ బీజేపీలో చేరుతున్నట్లు ఫడ్నవీస్ తెలిపారు. దేవేంద్ర ఫడ్నవీస్ కూడా అశోక్ చవాన్ నుండి ఎక్కడ సహాయం తీసుకోవాలో మాకు బాగా తెలుసు అని అన్నారు ఫడ్నవీస్.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…