ఉరి తీయాలనుకుంటే.. తీయండి.. దుర్మార్గుడికి పశ్చాత్తాపం అనేదే లేదు.. దేశాన్ని కుదిపేస్తున్న మెడికో హత్యాచార ఘటన..

|

Aug 12, 2024 | 4:11 PM

మెడికో హత్యాచార ఘటన దేశాన్ని కుదిపేస్తోంది. కోల్‌కతాలోని ఆర్‌జీ కర్‌ మెడికల్‌ కాలేజీలో ట్రైనీ డాక్టర్‌ (31) పై అత్యాచారం.. హత్యపై జూనియర్‌‌ డాక్టర్లు భగ్గుమన్నారు. ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్యోదంతంపై డాక్టర్లు, విద్యార్ధులు ఆందోళన ఉధృతం చేశారు. అత్యాచారం, హత్యను నిరసిస్తూ దేశవ్యాప్తంగా పలు రకాల వైద్య సేవలను నిలిపివేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడి‌ని విచారిస్తున్నారు.

ఉరి తీయాలనుకుంటే.. తీయండి.. దుర్మార్గుడికి పశ్చాత్తాపం అనేదే లేదు.. దేశాన్ని కుదిపేస్తున్న మెడికో హత్యాచార ఘటన..
Crime News
Follow us on

మెడికో హత్యాచార ఘటన దేశాన్ని కుదిపేస్తోంది. కోల్‌కతాలోని ఆర్‌జీ కర్‌ మెడికల్‌ కాలేజీలో ట్రైనీ డాక్టర్‌ తిలోత్తమ (31) పై అత్యాచారం.. హత్యపై జూనియర్‌‌ డాక్టర్లు భగ్గుమన్నారు. ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్యోదంతంపై డాక్టర్లు, విద్యార్ధులు ఆందోళన ఉధృతం చేశారు. అత్యాచారం, హత్యను నిరసిస్తూ దేశవ్యాప్తంగా పలు రకాల వైద్య సేవలను నిలిపివేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడి‌ని విచారిస్తున్నారు. డాక్టర్‌పై దారుణానికి ఒడిగట్టిన అనంతరం నిందితుడు సంజయ్ రాయ్ ఇంటికి వచ్చి సాక్ష్యాలను నాశనం చేసేందుకు ప్రయత్నించాడు. తన దుస్తుల్ని ఉతికి పడుకున్నాడని తేలింది. అయితే, నిందితుడి షూపై రక్తపు మరకలు ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. ఈ కేసులో మరెవరికైనా సంబంధం ఉందా అని ప్రశ్నించగా.. ప్రస్తుతానికి ఎలాంటి ఆధారాలు లభించలేదని, పూర్తి స్థాయి అటాప్సీ రిపోర్ట్‌ కోసం ఎదురు చూస్తున్నారు.

‘ఉరి తీయాలనుకుంటే.. తీయండి’..

పోలీసుల విచారణలో అతడి గురించి విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.. ఆస్పత్రిలోనే డాక్టర్‌పై అత్యాచారం చేసి ఆపై దారుణంగా హత్య చేశాడు.. అత్యాచారానికి తెగబడిన కామాంధుడు అత్యంత పాశవికంగా వ్యవహరించినట్టు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. బాధితురాలి ప్రైవేట్‌ పార్ట్స్‌, కళ్లు, నోటి నుంచి రక్తస్రావం, మెడ, కాళ్లుచేతులు, గోళ్లకు గాయాలున్నట్టు వైద్య నివేదికలో వెల్లడించారు. బాధితురాలి శరీరంపై గాయాలు, ప్రైవేట్ భాగాల నుంచి రక్తస్రావం అయినట్లు నిర్ధారించారు. నిందితుడు బెంగాల్ పోలీస్‌ విభాగంలో డిజాస్టర్ మేనేజ్‌మెంట్ బృందంలో వాలంటీర్‌గా పనిచేస్తున్నాడు.. పోకిరీ చేష్టలతో మహిళా సహోద్యోగుల పట్ల అమర్యాదగా ప్రవర్తించినట్లు తేలింది. విచారణలో వీటిని అంగీకరించిన నిందితుడు.. చేసిన తప్పునకు ఎలాంటి పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదని సమాచారం.. నిందితుడు.. తనను ఉరితీయాలనుకుంటే.. తీయండి.. అంటూ ఎదురుచెప్పడంతో పోలీసులు సైతం ఖంగుతిన్నారు.

కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో వైద్యురాలిపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడు సంజయ్ రాయ్ ఆసుపత్రి ఉద్యోగి కాదు, క్యాంపస్‌లోని భవనాల్లో తరచుగా కనిపించేవాడని పోలీసులు తెలిపారు. రాయ్ కోల్‌కతా పోలీస్‌ విభాగంలో వాలంటీర్‌గా పనిచేశారు. సివిక్ వాలంటీర్లు ట్రాఫిక్ నిర్వహణ, విపత్తు ప్రతిస్పందనతో సహా వివిధ రకాల పనిలో పోలీసులకు సహాయం చేయడానికి నియమించబడిన కాంట్రాక్టు సిబ్బంది. నెలకు దాదాపు రూ.12,000 చెల్లిస్తారు.. ఈ వాలంటీర్లు సాధారణ పోలీసు సిబ్బందికి అందుబాటులో ఉండే సౌకర్యాలను పొందలేరు. నివేదికల ప్రకారం, రాయ్ 2019లో కోల్‌కతా పోలీసుల డిజాస్టర్ మేనేజ్‌మెంట్ గ్రూప్‌లో వాలంటీర్‌గా చేరాడు.. అయితే ఆ తర్వాత పోలీసు సంక్షేమ విభాగానికి మారాడు. ఆ తర్వాత ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లోని పోలీసు అవుట్‌పోస్ట్‌లో నియమించారు. ఇక్కడ రాయ్ పోలీసుగా అక్రమాలకు పాల్పడేవాడని పోలీసులు తెలిపారు.

ఇదిలాఉంటే.. మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ తన పదవికి రాజీనామా చేశారు. కాగా.. కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారంపై నిరసనగా జూనియర్ డాక్టర్ల సమ్మె కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా వైద్య సేవలు బంద్‌ చేశారు.. ఆసుపత్రుల్లో వైద్యులకు భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. భద్రతకు సంబంధించిన డిమాండ్లను పరిష్కరించే వరకు తమ ఆందోళనను కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

ఈ ఘటనపై పశ్చిమ బెంగాల్‌లో రాజకీయాలు సైతం వేడెక్కాయి.. తృణముల్ ప్రభుత్వం బీజేపీ ఆగ్రహం వ్యక్తంచేసింది.. బీజేపీ నేతలు క్యాండిల్‌ మార్చ్‌, నిరసనలు చేపట్టారు. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..