Rain Alert: నైరుతి రుతుపవనాల ఎఫెక్ట్‌.. ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్‌!

వర్షాల కోసం ఎదరుచూస్తున్న రైతులకు భారత వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. సెప్టెంబర్ 6 ఆదివారం నాడు దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాల కదిలిక చురుగ్గా ఉందని.. ఈ ప్రభావంతో దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. కాబట్టి వాతావరణ శాఖ ప్రకారం.. ఏ ఏ రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయో చూద్దాం.

Rain Alert: నైరుతి రుతుపవనాల ఎఫెక్ట్‌.. ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్‌!
Heavy Rain Alert Across India

Updated on: Sep 06, 2026 | 11:43 AM

దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాల కదిలిక చురుగ్గా ఉందని.. వీటి ప్రభావంతో దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురసే ఛాన్స్ ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు పలు రాష్ట్రాలకు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్‌ జారీ చేసింది వాతవారణ శాఖ. వాతావరణ శాఖ ప్రకారం ఆదివారం ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ, బిహార్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపురలతో పాటు ఉప-హిమాలయన్ పశ్చిమ బెంగాల్, సిక్కింలలో భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని స్పష్టం చేసింది.

ఈ వర్షాల నేపథ్యంలో గురుగ్రామ్, ఫరీదాబాద్, ఘజియాబాద్, నోయిడాలకు ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అలాగే పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో ఆదివారం, తూర్పు ఉత్తరప్రదేశ్‌లో సెప్టెంబర్ 6 నుంచి 8 వరకు విస్తారంగా వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. తూర్పు రాజస్థాన్‌లోనూ భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. బిహార్, తూర్పు మధ్యప్రదేశ్, తూర్పు రాజస్థాన్, గంగా తీర పశ్చిమ బెంగాల్, జమ్మూ-కశ్మీర్, లడఖ్, కర్ణాటక, పశ్చిమ రాజస్థాన్‌లలో గంటకు 30-40 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని అలాగే తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40-50 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీయవచ్చని తెలిపింది. ఇక ఈశాన్య రాష్ట్రాలైన, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్‌లలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని ఐఎండీ వెల్లడించింది.

సోమవారం వెదర్ అప్‌డేట్

ఇక సోమవారం కూడా పలు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ, బిహార్, మధ్యప్రదేశ్ , తూర్పు ఉత్తరప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఉత్తరాఖండ్, సిక్కింలలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని.. బిహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్‌లలో 30-40 కి.మీ. వేగంతో ఈదురు గాలులతో పాటు ఉరుములు, మెరుపులు వచ్చే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us