Anmol Bishnoi: లారెన్స్ బిష్ణోయ్‌కి మరో షాక్.. అతని సోదరుడు అరెస్ట్.. అన్నాదమ్ములు జైలులోనే!

|

Nov 19, 2024 | 9:32 AM

గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ సోదరుడు అన్మోల్‌ బిష్ణోయ్‌ను కాలిఫోర్నియాలో అమెరికా పోలీసులు అరెస్ట్‌ చేశారు. సల్మాన్‌ ఇంటిపై కాల్పుల కేసుతో పాటు మహరాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్దిఖీ హత్య కేసులో అతడు నిందితుడిగా ఉన్నాడు. అన్మోల్‌ను భారత్‌కు తరలించేందుకు ముంబై పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

Anmol Bishnoi: లారెన్స్ బిష్ణోయ్‌కి మరో షాక్.. అతని సోదరుడు అరెస్ట్.. అన్నాదమ్ములు జైలులోనే!
Lawrence Bishnoi
Follow us on

బాలీవుడ్‌ స్టార్స్‌కు , రాజకీయనాయకులకు దడపుట్టిస్తున్న గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ సోదరుడు అన్మోల్‌ బిష్ణోయ్‌ను అమెరికా పోలీసులు అరెస్ట్‌ చేశారు. కాలిఫోర్నియాలో పోలీసులకు చిక్కాడు అన్మోల్‌ బిష్ణోయ్‌. బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్‌ఖాన్‌ ఇంటిపై కాల్పులకు స్కెచ్‌ గీసింది అన్మోల్‌ అని పోలీసుల దర్యాప్తులో వెల్లడయ్యింది. రెండు హత్య కేసులో నిందితుడిగా ఉన్న అతడిపై జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఏ 10 లక్షల రివార్డును కూడా ప్రకటించింది. పంజాబ్‌ సింగర్‌ సిద్దూ మూసేవాల హత్యతో పాటు మరో హత్యలో కూడా అన్మోల్‌ ప్రమేయముంది.

దొంగపాస్‌పోర్ట్‌తో విదేశాలకు అన్మోల్‌ బిష్ణోయ్‌ పారిపోయాడు. తొలుత కెనడాకు పారిపోయిన అన్మోల్‌ తరువాత అమెరికాలో అక్రమంగా తలదాచుకున్నాడు. మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ హత్యలోనూ అన్మోల్‌ ప్రమేయం ఉంది. ఈ క్రమంలోనే అన్మోల్ బిష్ణోయ్‌ని అరెస్ట్ ట్లు తెలుస్తోంది.

లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ వ్యవహారాలు చూడడం, సెలబ్రిటీలను బెదిరించడం, హత్యలు చేయడంలో కీలక నిందితుడిగా అన్మోల్ బిష్ణోయ్ ఉన్నారు. బాబా సిద్ధిఖీ హత్య కేసు నిందితులతో అన్మోల్ బిష్ణోయ్ టచ్‌లో ఉన్నట్లు ముంబై పోలీసులు గుర్తించారు. విదేశాల్లో ఉంటున్న అన్మోల్‌ బిష్ణోయ్‌ని అరెస్ట్ చేసేందుకు.. భారత్ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే అతడ్ని భారత్‌కు రప్పించే ప్రక్రియను ప్రారంభించేందుకు అనుమతి కోరుతూ ప్రత్యేక కోర్టులో ఇప్పటికే ముంబై పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు.

ఇవి కూడా చదవండి

లారెన్స్‌ బిష్ణోయ్ తరఫున అన్మోల్ బిష్ణోయ్ పలు చట్టవిరుద్ధ కార్యకలాపాల్లో భాగం అయ్యాడని పోలీసులు అందులో వెల్లడించారు. దీంతో అన్మోల్ బిష్ణోయ్‌పై స్పెషల్ కోర్టు నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..