ఢిల్లీలో కాల్పులు జరిపిన కానిస్టేబుల్.. ఇద్దరికి గాయాలు..!

ఢిల్లీలో కాల్పులు జరిపిన కానిస్టేబుల్.. ఇద్దరికి గాయాలు..!

దేశ రాజధాని ఢిల్లీలో కాల్పులు కలకలం రేపాయి. సీలంపూర్ పోలీస్‌ స్టేషన్‌లో పనిచేస్తోన్న కానిస్టేబుల్‌.. మీట్ నగర్‌లో ఓ ఇంటి వద్ద కాల్పులు జరిపాడు.

TV9 Telugu Digital Desk

| Edited By:

May 05, 2020 | 8:29 AM

దేశ రాజధాని ఢిల్లీలో కాల్పులు కలకలం రేపాయి. సీలంపూర్ పోలీస్‌ స్టేషన్‌లో పనిచేస్తోన్న కానిస్టేబుల్‌.. మీట్ నగర్‌లో ఓ ఇంటి వద్ద కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి.

పోలీసుల వివరాల ప్రకారం.. సదరు కానిస్టేబుల్ సోదరుడిపై సోమవారం ఇంటిపక్కనున్న ఓ వ్యక్తి దాడి చేశాడు. ఈ ఘటనలో అతడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆగ్రహించిన కానిస్టేబుల్‌ తన సోదరుడిపై దాడి చేసిన వ్యక్తిపై కాల్పులు జరిపాడు. విషయం తెలుసుకున్న పోఈసులు.. కాల్పులు జరిపిన కానిస్టేబుల్ సహా ఐదుగురికి అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు.

Read This Story Also: గుడ్‌న్యూస్.. కోవిడ్‌ను అడ్డుకునే యాంటీబాడీల గుర్తింపు..!

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu