గుడ్‌న్యూస్.. కోవిడ్‌ను అడ్డుకునే యాంటీబాడీల గుర్తింపు..!

మానవ శరీరంలోకి కరోనా వైరస్ వ్యాపించకుండా అడ్డుకునే యాంటీబాడీని ఉట్రేచ్ట్‌ యూనివర్సిటీలోని ఎరాస్మస్ మెడికల్ సెంటర్ అండ్ హార్బర్ బయోమెడ్‌ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ మేరకు వారు ఓ ప్రకటనలో వెల్లడించారు. కరోనా చికిత్సలో ఇది ఓ కీలక అడుగు.  ఈ కణం ‘సార్స్ కోవ్‌ 2’లోకి ఒక కణాన్ని పట్టుకొని వైరస్‌ వ్యాప్తిని అడ్డుకుంటుందని డాక్టర్ బాష్ వెల్లడించారు. ఆయన ఈ పరిశోధనకు అధ్యక్షత వహించారు. ”ఈ యాంటీ బాడీకి క్రాస్ న్యూట్రలైజింగ్ గుణం ఉంది. […]

గుడ్‌న్యూస్.. కోవిడ్‌ను అడ్డుకునే యాంటీబాడీల గుర్తింపు..!
Follow us

| Edited By:

Updated on: May 05, 2020 | 8:05 AM

మానవ శరీరంలోకి కరోనా వైరస్ వ్యాపించకుండా అడ్డుకునే యాంటీబాడీని ఉట్రేచ్ట్‌ యూనివర్సిటీలోని ఎరాస్మస్ మెడికల్ సెంటర్ అండ్ హార్బర్ బయోమెడ్‌ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ మేరకు వారు ఓ ప్రకటనలో వెల్లడించారు. కరోనా చికిత్సలో ఇది ఓ కీలక అడుగు.  ఈ కణం ‘సార్స్ కోవ్‌ 2’లోకి ఒక కణాన్ని పట్టుకొని వైరస్‌ వ్యాప్తిని అడ్డుకుంటుందని డాక్టర్ బాష్ వెల్లడించారు. ఆయన ఈ పరిశోధనకు అధ్యక్షత వహించారు.

”ఈ యాంటీ బాడీకి క్రాస్ న్యూట్రలైజింగ్ గుణం ఉంది. ఇది కరోనా వైరస్‌ను అడ్డుకోవడంలో కీలక పాత్ర పోషిస్తుంది. సార్స్‌ కోవ్‌ 1 యాంటీ బాడీలను ఉపయోగించి సార్స్ కోవ్‌ 2ను అడ్డుకునే వ్యాధి నిరోధక కణాలను గుర్తించాము” అని బాష్ తెలిపారు. దీనిపై హెచ్‌బీఎం ఛైర్మన్‌ డాక్టర్ జింగ్‌సాంగ్ వాంగ్ మాట్లాడుతూ.. ”కరోనా వైరస్‌ను అడ్డుకునే క్రమంలో ఇదొక ముందడుగు. మానవ శరీరంలోని వ్యాధి తీవ్రతను ఈ యాంటీ బాడీ ఏ మేరకు కట్టడి చేస్తుంది అనే అంశంపై పరిశోధనలు చేయాలి. మా భాగస్వామ్యులతో కలిసి ఈ పరిశోధనను ముందుకు తీసుకెళతాం. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ఈ పరిశోధన ఎంతో కొంత ప్రయోజనకరంగా ఉంటుందని ఆశిస్తున్నా” అని వెల్లడించారు.

Read This Story Also: మహేష్‌తో అలాంటి సినిమా చేయాలనుకుంటోన్న రాజమౌళి..!