MLC Kavitha: ఢిల్లీ హైకోర్టులో ఎమ్మెల్సీ కవితకు చుక్కెదురు..

ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ కోర్టులో చుక్కెదురైంది. లిక్కర్‌ కేసులో అరెస్ట్‌ అయిన కవిత.. తీహార్‌ జైల్లో ఉన్నారు. అయితే బెయిల్‌ కోసం దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ), సీబీఐ కేసుల్లో అరెస్టు కాగా, అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు.

MLC Kavitha: ఢిల్లీ హైకోర్టులో ఎమ్మెల్సీ కవితకు చుక్కెదురు..
Mlc Kavitha
Follow us

|

Updated on: Jul 01, 2024 | 5:30 PM

ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ కోర్టులో చుక్కెదురైంది. లిక్కర్‌ కేసులో అరెస్ట్‌ అయిన కవిత.. తీహార్‌ జైల్లో ఉన్నారు. అయితే బెయిల్‌ కోసం దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ), సీబీఐ కేసుల్లో అరెస్టు కాగా, అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. మనీలాండరింగ్‌ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న కవిత.. బెయిల్‌ కోసం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. పిటిషన్‌పై సోమవారం విచారించిన ఢిల్లీ హైకోర్టు.. బెయిల్‌ ఇచ్చేందుకు నిరాకరించింది. ఎక్సైజ్ పాలసీ కేసులో కీలక పాత్ర పోషించినందుకు కవితను మొదట ఈడీ అరెస్టు చేసింది. కోర్టు ఆదేశాల మేరకు తీహార్ జైలుకు తరలించారు. మరోవైపు లిక్కర్ పాలసీ కేసును విచారించిన సీబీఐ.. జైల్లో ఉండగానే ఆమెను అరెస్ట్ చేసింది. హైకోర్టులో విచారణ సందర్భంగా, ‘స్కాం’ వెనుక కుట్రలో ఆమె కీలక పాత్ర పోషించారని పేర్కొంటూ బెయిల్ పిటిషన్‌ను సీబీఐ, ఈడీ వ్యతిరేకిస్తూ వస్తున్నాయి.

అయితే కవితకు బెయిల్‌ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందనిన ఈడీ, సీబీఐ కోర్టుకు తెలిపింది. మార్చి 15న హైదరాబాద్‌లోని ఆమెను ఈడీ అరెస్టు చేసింది. లిక్కర్‌ స్కామ్‌లో కవిత ప్రముఖ పాత్ర పోషించినట్లు, ‘సౌత్ గ్రూప్’లో భాగమని ఆరోపణలు ఉన్నాయి. ఇందులో భాగంగా తన వాణిజ్య అవసరాలకు అనుగుణంగా ఢిల్లీ ప్రభుత్వ మద్యం పాలసీలో మార్పులు చేసేందుకు ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వానికి రూ.100 కోట్లు చెల్లించిందని దర్యాప్తు సంస్థ ఆరోపించింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మీరు క్రెడిట్ కార్డ్ ద్వారా కూడా మీ పన్ను చెల్లించవచ్చు.. ఎలాగంటే
మీరు క్రెడిట్ కార్డ్ ద్వారా కూడా మీ పన్ను చెల్లించవచ్చు.. ఎలాగంటే
ఇక ఆటలు సాగవు.. తిరుమలలో దళారులకు టీటీడీ చెక్..!
ఇక ఆటలు సాగవు.. తిరుమలలో దళారులకు టీటీడీ చెక్..!
'తిట్టిన ప్రతీ నోరు మూసుకోవాల్సిందే..' రోహిత్ ఫ్యాన్ ఏం చేశాడంటే
'తిట్టిన ప్రతీ నోరు మూసుకోవాల్సిందే..' రోహిత్ ఫ్యాన్ ఏం చేశాడంటే
కమెడియన్ రఘు కూతుళ్లను ఎప్పుడైనా చూశారా..?
కమెడియన్ రఘు కూతుళ్లను ఎప్పుడైనా చూశారా..?
ప్రపంచంలోనే అత్యుత్తమ విస్కీ తయారీ కంపెనీ యజమాని ఎవరు?
ప్రపంచంలోనే అత్యుత్తమ విస్కీ తయారీ కంపెనీ యజమాని ఎవరు?
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు..!
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు..!
జులై 4 నుంచి గురుకుల పీఈటీ అభ్యర్థులకు ధ్రువపత్రాల పరిశీలన
జులై 4 నుంచి గురుకుల పీఈటీ అభ్యర్థులకు ధ్రువపత్రాల పరిశీలన
ఆ బ్యాంకు కస్టమర్లకు గుడ్ న్యూస్.. ఎఫ్‌డీలపై భారీగా పెరిగిన వడ్డీ
ఆ బ్యాంకు కస్టమర్లకు గుడ్ న్యూస్.. ఎఫ్‌డీలపై భారీగా పెరిగిన వడ్డీ
ఫుల్ టైమ్ వైల్డ్ ఫోటోగ్రాఫర్ గా మారిన స్టార్ హీరోయిన్..
ఫుల్ టైమ్ వైల్డ్ ఫోటోగ్రాఫర్ గా మారిన స్టార్ హీరోయిన్..
డేంజర్ బెల్స్ మోగిస్తున్న డెంగ్యూ 50 శాతం శాంపిల్స్‌లో పాజిటివ్‌‌
డేంజర్ బెల్స్ మోగిస్తున్న డెంగ్యూ 50 శాతం శాంపిల్స్‌లో పాజిటివ్‌‌