India Coronavirus: గుడ్‌న్యూస్.. దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు, మరణాలు.. నిన్న ఎన్నంటే..?

India Covid-19 Updates: దేశంలో కరోనా మహమ్మారి కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. కోవిడ్ సెకండ్‌ వేవ్‌ అనంతరం.. కేసుల సంఖ్య తగ్గినట్లే తగ్గి మళ్లీ

India Coronavirus: గుడ్‌న్యూస్.. దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు, మరణాలు.. నిన్న ఎన్నంటే..?
India Corona
Follow us

|

Updated on: Nov 30, 2021 | 1:36 PM

India Covid-19 Updates: దేశంలో కరోనా మహమ్మారి కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. కోవిడ్ సెకండ్‌ వేవ్‌ అనంతరం.. కేసుల సంఖ్య తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగిన కేసులు ఆందోళనకు గురిచేశాయి. ఈ క్రమంలో కేసుల సంఖ్య రోజురోజుకూ దిగి వస్తోంది. సోమవారం కేసుల సంఖ్య భారీగా తగ్గింది. గడిచిన 24 గంటల్లో సోమవారం దేశవ్యాప్తంగా 6,990 కేసులు నమోదయ్యాయి. 551 రోజుల తర్వాత కేసుల సంఖ్య ఈ స్థాయిలో నమోదయ్యాయి. దీంతోపాటు.. ఈ మహమ్మారి కారణంగా నిన్న 190 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ మంగళవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో 1,00,54 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఏడాదిన్నర తర్వాత క్రియాశీల కేసుల సంఖ్య భారీగా తగ్గినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దేశంలో మార్చి తర్వాత రికవరీ రేటు గణనీయంగా పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం రికవరీ రేటు 98.35 శాతానికిపైగా ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

తాజాగా నమోదైన గణాంకాలతో కలిపి దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,45,87,822 కి చేరగా.. మరణాల సంఖ్య 4,68,980 కి పెరిగినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. కాగా నిన్న కరోనా నుంచి 10,116 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి కోలుకున్న వారి సంఖ్య 3,40,18,299 కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

కాగా.. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1,23,25,02,767 వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది. ఇదిలాఉంటే.. ఇప్పటివరకు దేశంలో 64.13 కోట్ల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు కేంద్రం వెల్లడించింది.

Also Read:

Crime News: చపాతీలు చేయనన్నందుకు యువకుడి హత్య.. దారుణంగా గొంతుకోసి..

Hyderabad: బంగారం అక్రమ రవాణా.. హైదరాబాద్ నగల వ్యాపారిని అరెస్టు చేసిన ఈడీ