శీతలంలోనే కాదు.. సమ్మర్ లోనూ కరోనా భయం ? నిపుణుల వార్నింగ్

ప్రపంచ దేశాలను అట్టుడికిస్తున్న కరోనా ఇప్పుడప్పుడే వీడేలా కనిపించడంలేదు. ఇండియాలో ఈ కొత్త వైరస్ సమ్మర్ (వేసవి) లోనూ కొంతకాలం కొనసాగుతుందని, 'మాయమైనట్టే మాయమై' మళ్ళీ వింటర్ లో ఎంటరవుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థతో బాటు...

శీతలంలోనే కాదు.. సమ్మర్ లోనూ కరోనా భయం ? నిపుణుల వార్నింగ్
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Mar 17, 2020 | 1:52 PM

ప్రపంచ దేశాలను అట్టుడికిస్తున్న కరోనా ఇప్పుడప్పుడే వీడేలా కనిపించడంలేదు. ఇండియాలో ఈ కొత్త వైరస్ సమ్మర్ (వేసవి) లోనూ కొంతకాలం కొనసాగుతుందని, ‘మాయమైనట్టే మాయమై’ మళ్ళీ వింటర్ లో ఎంటరవుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థతో బాటు నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు. ఈ వైరస్ నివారణకు మేలైన చికిత్స, పరిశోధనల్లో నిమగ్నమై ఉన్న ఎక్స్ పర్ట్స్.. ఇది వేడి, తేమతో  కూడిన వాతావరణం లోనూ ట్రాన్స్ మిట్  అయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు సహజ సిధ్ధమైన రోగనిరోధక శక్తి మనుషుల్లో ఇంకా రాలేదని, జనావాసాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో క్లోజ్ కాంటాక్ట్ కారణంగానో, శ్వాస సంబంధ సన్నిహిత పోకడల వల్లో ఇది వ్యాపిస్తుందని  వారు అంచనా వేశారు. దగ్గు, లేదా తుమ్ముల ద్వారా వచ్ఛే తుంపరల్లోని  కణాలు ఏప్రిల్ లేదా మే నెలల వంటి ఉష్ణోగ్రతల కాలంలో ఎక్కువకాలం సజీవంగా ఉండజాలవని వారు అభిప్రాయపడ్డారు. అయినా ప్రజలు ఎక్కువగా గుమికూడకుండా చూడాల్సి ఉందని, అప్పుడే ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా సోకకుండా ఉంటాయన్నది వీరి విశ్లేషణ.

కాగా-కరోనా వ్యాప్తిపై ఢిల్లీలోని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా మాట్లాడుతూ.. ఈ వైరస్.. ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి సోకుతుందని అన్నారు. మాంసాహారమో, లేదా కోడిగుడ్లో తిన్నంత మాత్రాన.. ఇన్ఫెక్షన్ రాదని ఆయన స్పష్టం చేశారు. సాధారణంగా అన్ని రకాల మాంస పదార్థాలనూ శుభ్రంగా కడిగి, శుచిగా వండాలని ఆయన సూచించారు. ఉష్ణోగ్రతలు పెరిగితే చివరకు కరోనా నశిస్తుందన్నది అపోహే అని ఆయన పేర్కొన్నారు.