పేదల ఓట్లను భారీగా తొలగిస్తున్నారు: సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

ఢిల్లీలో ఇండియా కూటమి నిర్వహిస్తున్న 'ఓట్ బచావో.. దేశ్ బచావో' ర్యాలీకి ముందు సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పేదల ఓట్లను తొలగిస్తున్నారని బీజేపీపై ఆరోపణలు చేశారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో ఓటు హక్కుల పరిరక్షణ కోసం కాంగ్రెస్ పోరాటం కొనసాగిస్తుందని వెల్లడించారు.

పేదల ఓట్లను భారీగా తొలగిస్తున్నారు: సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
Cm Revanth Reddy

Updated on: Nov 01, 2026 | 1:40 PM

ఢిల్లీలో ఇండియా కూటమి మార్చ్‌పై ఉత్కంఠ నెలకొంది.. రామ్‌లీలా మైదానం వేదికగా ఆదివారం సాయంత్రం భారీ బహిరంగ సభ జరగనుంది.. ఈ మేరకు మింటో రోడ్- కన్నాట్ ప్లేస్ జంక్షన్ నుంచి మార్చ్‌ ప్రారంభమై.. రామ్‌లీలా మైదానం వరకు ర్యాలీ కొనసాగనుంది. ఓట్‌ బచావో.. దేశ్ బచావో ర్యాలీ నేపథ్యంలో భారీ భద్రత ఏర్పాటు చేశారు. సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామాతోపాటు 2023 ఎన్నికల కమిషన్ చట్టం రద్దు చేయాలని.. SIR ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని.. తొలగించిన ఓటర్ల పేర్లను తిరిగి చేర్చి.. బ్యాలెట్ పేపర్లతోనే ఎన్నికలను నిర్వహించాలని ఇండియా కూటమి డిమాండ్ చేస్తోంది.

ఓట్‌ బచావో.. దేశ్ బచావో ర్యాలీ కోసం కాంగ్రెస్ లీడర్లు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. తెలంగాణ నుంచే 7వేల మందికిపై కాంగ్రెస్ కార్యకర్తలు ఢిల్లీ చేరారు. 77 బస్సులు, 600 కార్లలో ఢిల్లీలో తెలంగాణ భవన్‌కి లీడర్లు చేరుకున్నారు. తెలంగాణ భవన్‌కి చేరుకున్న కార్యకర్తలనుద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. అక్కడి నుంచి ర్యాలీగా రామ్ లీలా మైదాన్‌కి కాంగ్రెస్‌ నేతల ర్యాలీ కొనసాగనుంది.

ఓట్ చోరీపై పోరాటం: సీఎం రేవంత్ రెడ్డి..

ఓట్ చోరీతో బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు కుట్రలు చేస్తోందని.. సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. బీజేపీ గద్దె దిగేంత వరకు కాంగ్రెస్ పోరాటం కొనసాగుతుందన్నారు. పేదల ఓట్లను పెద్ద ఎత్తున తొలగిస్తున్నారని.. ఓట్ చోరీపై రాహుల్ గాంధీ నేతృత్వంలో పోరాటం కొనసాగుతుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

Loading...
Unable to load recommendations.
Follow Us