E-Tourist Visa: పర్యాటకులకు శుభవార్త.. వాటిపై నిషేధం ఎత్తివేత.. కేంద్రప్రభుత్వ మార్గదర్శకాలు ఇవే

|

Mar 16, 2022 | 6:33 PM

కరోనా కారణంగా రెండేళ్ల క్రితం ఈ-టూరిస్ట్ వీసాలపై నిషేధం విధించిన కేంద్ర ప్రభుత్వం వాటిని తిరిగి పునరుద్ధరించింది. ఈ-టూరిస్ట్ వీసాలతో పాటు అన్ని దేశాల పౌరుల సాధారణ వీసాలు, అమెరికా- జపాన్ దేశాల...

E-Tourist Visa: పర్యాటకులకు శుభవార్త.. వాటిపై నిషేధం ఎత్తివేత.. కేంద్రప్రభుత్వ మార్గదర్శకాలు ఇవే
E Tourist Visa
Follow us on

కరోనా కారణంగా రెండేళ్ల క్రితం ఈ-టూరిస్ట్ వీసాలపై నిషేధం విధించిన కేంద్ర ప్రభుత్వం వాటిని తిరిగి పునరుద్ధరించింది. ఈ-టూరిస్ట్ వీసాలతో పాటు అన్ని దేశాల పౌరుల సాధారణ వీసాలు, అమెరికా- జపాన్ దేశాల పౌరులకు పదేళ్ల పర్యటక వీసాలపై ఆంక్షలు తొలగిస్తున్నామని తెలిపింది. కొత్త వీసాలు సైతం జారీ చేస్తున్నట్లు వెల్లడించింది. ఐదేళ్ల కాలపరిమితి ఉండి, చెల్లుబాటు అయ్యే ఈ-టూరిస్ట్ వీసా హోల్డర్లకు దేశంలోకి అనుమతి ఉంటుందని కేంద్రం ప్రకటించింది. ఈ నిర్ణయం తక్షణమే అమలులోకి వస్తుందని స్పష్టం చేసింది. వీటితో పాటు అమెరికా, జపాన్ దేశస్థులకు ఇచ్చే దీర్ఘకాల రెగ్యులర్ టూరిస్ట్ వీసాలపైనా ఆంక్షలు ఎత్తివేసినట్లు అధికారులు వివరించారు. ఈ రెండు దేశాల పౌరులకు కొత్తగా పదేళ్ల వీసాలను సైతం జారీ చేస్తామని తెలిపారు. 156 దేశాలకు చెందిన పౌరులకు కేంద్రం ఐదేళ్ల కాలపరిమితి కలిగిన ఈ-టూరిస్ట్ వీసాలను జారీ చేస్తోంది. 156 దేశాలకు చెందిన అర్హులైన వ్యక్తులకు 2019 మ్యాన్యువల్ ప్రకారం వీసాలను జారీ చేస్తామని తెలిపింది.

చెల్లుబాటు అయ్యే వీసా ఉన్న విదేశీయులు సముద్ర ఇమ్మిగ్రేషన్ చెక్​పోస్టులు, ఎయిర్​పోర్ట్ ఐసీపీల గుండా దేశంలోకి ప్రవేశించవచ్చని ప్రకటించింది. భూసరిహద్దులు, నదిమార్గాల ద్వారా వీరిని దేశంలోకి అనుమతించేది లేదని స్పష్టం చేసింది. అయితే, ఈ నిబంధనలు అఫ్గానిస్థాన్ పౌరులకు వర్తించవని, వీరికి కేంద్ర హోంశాఖ ప్రత్యేకంగా ఈ-ఎమర్జెన్సీ, ఎక్స్-మిస్క్ వీసాలను జారీ చేస్తోందని అధికారులు తెలిపారు. కరోనా కొత్త వేరియంట్ ఒమైక్రాన్ శరవేగంగా ప్రబలిన పరిస్థితులలో పలు దేశాలు ప్రయాణాలపై ఆంక్షలు విధించాయి. గల్ఫ్ దేశాలు కూడా కొత్త వేరియంట్ ప్రభావం ఉన్న ఆఫ్రికన్ దేశాలపై నిషేధం విధించాయి. ఒమిక్రాన్‌పై పోరులో భాగంగా పర్యాటకులకు ఇచ్చే విజిట్ వీసాల జారీని మరింత కఠినతరం చేసింది. ఒమైక్రాన్ ప్రభావిత దేశాల నుంచి వచ్చే పౌరులకు విజిట్ వీసాలను జారీ చేసే విషయమై కఠిన నిబంధనలు అమలు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.

ఇవీచదవండి

Viral Video: అర్జున్ రెడ్డి సినిమాలోని సీన్‌ను లైవ్‌లో చూపిన డాక్టర్.. రోగిని పొట్టు పొట్టుగా కొట్టిన వీడియో వైరల్

Womens World Cup 2022: చ‌రిత్ర సృష్టించిన భారత ఫాస్ట్ బౌలర్.. ఆ లిస్టులో ఏకైక మహిళా ప్లేయర్‌గా రికార్డు..

తెలుగురాష్ట్రాల్లో మారిన పది, ఇంటర్ – 2022 పరీక్షల షెడ్యూళ్లు! అసలెందుకు మార్చారో తెలుసా..