Uttar Pradesh: గుజరాత్‌ ఘటన మరువక ముందే యూపీలో మరో ప్రమాదం.. కుప్పకూలిన వంతెన..

|

Oct 31, 2022 | 4:02 PM

గుజరాత్‌లో మోర్బీ వంతెన ఘోర ప్రమాదం మరువక ముందే ఉత్తరప్రదేశ్‌లో మరో వంతెన కుప్పకూలిపోయింది. యూపీలోని చందోలిలో ఛఠ్ పూజ సందర్భంగా..

Uttar Pradesh: గుజరాత్‌ ఘటన మరువక ముందే యూపీలో మరో ప్రమాదం.. కుప్పకూలిన వంతెన..
Uttar Pradesh Bridge Collapsed
Follow us on

గుజరాత్‌లో మోర్బీ వంతెన ఘోర ప్రమాదం మరువక ముందే ఉత్తరప్రదేశ్‌లో మరో వంతెన కుప్పకూలిపోయింది. యూపీలోని చందోలిలో ఛఠ్ పూజ సందర్భంగా నది కాలువపై నిర్శించిన వంతెనపై జనం పోటెత్తారు. జనాలు ఎక్కువ అవడంతో.. ఆ వంతెన కుప్పకూలిపోయింది. అదృష్టావశాత్తు ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరుగలేదు. అందరూ క్షేమంగా బయటపడ్డారు. అయితే, ఈ వంతెన కూలిన ఘటనకు సంబంధించి వీడియో వైరల్ అవుతోంది.

స్థానికులు తెలిపిన సమాచారం ప్రకారం.. చందోలి జిల్లాలోని ఛకియా మండలం పరిధిలోని సరైయా గ్రామంలో ప్రజలు ఛట్ పూజను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ పూజలో భాగంగలో ప్రజలంతా స్థానికంగా ఉన్న కాలువ వద్దకు వచ్చారు. అయితే, కాలువపై ఇటుకలతో నిర్మించిన బ్రిడ్జిపై అందరూ ఒకేసారి వచ్చారు. ఈ సమయంలో బ్రిడ్జి ముందు భాగంలో చిన్న పగుళ్లు వచ్చాయి. అదికాస్తా ఎక్కువై వంతెన కూలిపోయింది. ఈ ఘటన సమయంలో నీటి ప్రవాహం కూడా ఎక్కువగా లేకపోవడం, ఎవరూ అందులో పడకపోవడంతో ప్రమాదం తప్పింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..