Varun Gandhi: ఫిలిబిత్‌ బీజేపీ టిక్కెట్‌పై సన్నగిల్లుతున్న ఆశలు.. పోటీ చేసి తీరుతానంటున్న వరుణ్‌

|

Mar 20, 2024 | 9:27 PM

ఉత్తరప్రదేశ్‌లోని ఫిలిబిత్‌ లోక్‌సభ నియోజకవర్గం ఎంపీ వరుణ్‌గాంధీ రాజకీయ భవితవ్యంపై ఉత్కంఠ నెలకొంది. భారతీయ జనతా పార్టీ టిక్కెట్‌ రాకపోతే స్వతంత్ర అభ్యర్ధిగానైనా బరి లోకి దిగాలన్న ఆలోచనతో ఉన్నారట వరుణ్‌గాంధీ.

Varun Gandhi: ఫిలిబిత్‌ బీజేపీ టిక్కెట్‌పై సన్నగిల్లుతున్న ఆశలు.. పోటీ చేసి తీరుతానంటున్న వరుణ్‌
Varun Gandhi
Follow us on

ఉత్తరప్రదేశ్‌లోని ఫిలిబిత్‌ లోక్‌సభ నియోజకవర్గం ఎంపీ వరుణ్‌గాంధీ రాజకీయ భవితవ్యంపై ఉత్కంఠ నెలకొంది. భారతీయ జనతా పార్టీ టిక్కెట్‌ రాకపోతే స్వతంత్ర అభ్యర్ధిగానైనా బరి లోకి దిగాలన్న ఆలోచనతో ఉన్నారట వరుణ్‌గాంధీ.

బీజేపీ టిక్కెట్‌ ఇవ్వకపోతే ఏం చేయాలన్న విషయంపై క్లారిటీతో ఉన్నారు ఆ పార్టీ ఎంపీ వరుణ్‌గాంధీ. ఉత్తర ప్రదేశ్‌లోని ఫిలిబిత్‌ నుంచి కచ్చితంగా పోటీ చేస్తానని ఆయన చెబుతున్నారు. బీజేపీ టిక్కెట్‌ ఇవ్వకపోతే సమాజ్‌వాదీ పార్టీ నుంచి లేదా ఇండిపెండెంట్‌ అభ్యర్ధిగా పోటీ చేయాలన్న ఆలోచనతో ఉన్నారు. ఇప్పటికే పార్టీలో చేరాలని సమాజ్‌వాదీ పార్టీ నుంచి ఆయనకు ఆహ్వానం అందింది. బీజేపీ టిక్కెట్‌ ఇవ్వకపోతే ఆయన ఏం చేస్తారన్న విషయంపై ఉత్కంఠ నెలకొంది.

లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఉత్తరప్రదేశ్‌లో 51 స్థానాలకు బీజేపీ తొలి జాబితాలోనే అభ్యర్థులను ప్రకటించింది. మరో 24 సీట్లను ఖరారు చేయలేదు. అందులో వరుణ్‌ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తోన్న ఫిలిబిత్‌, , ఆయన తల్లి మేనకా గాంధీ ఎంపీగా ఉన్న సుల్తాన్‌పుర్‌లు ఉన్నాయి. అయితే, ఈసారి మేనకా గాంధీకి సుల్తాన్‌పుర్‌ ఖరారు చేసే అవకాశం ఉన్నప్పటికీ వరుణ్‌ గాంధీకి మాత్రం మొండిచేయి చూపొచ్చనే వార్తలు వస్తున్నాయి. వరుణ్‌ స్థానంలో యూపీ మంత్రి జితిన్‌ ప్రసాద లేదా ఫిలిబిత్‌ ఎమ్మెల్యేకు చోటు కల్పించవచ్చనే వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే.. వరుణ్‌ గాంధీ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచే అవకాశం ఉందని సమాచారం.

మరోవైపు సమాజ్‌వాదీ పార్టీ కూడా వరుణ్‌ను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. బీజేపీతో పాటు యూపీ అధికార పక్షం తీరుపై వరుణ్‌ గాంధీ విమర్శలు గుప్పిస్తున్నారు. కొద్దిరోజుల క్రితమే రాహుల్‌ గాంధీని వరుణ్‌ గాంధీ కేదార్‌నాథ్‌లో కలుసుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. బీజేపీకి దూరంగా ఉంటున్న వరుణ్‌ పార్టీ మారే అవకాశం ఉందన్న వార్తలు కూడా వచ్చాయి. పిలిభిత్‌ స్థానానికి నాలుగు సెట్ల నామినేషన్‌ పత్రాలను ఆయన ప్రతినిధులు ఢిల్లీ నుంచి యూపీకి ఇప్పటికే తీసుకొచ్చారని పేర్కొన్నాయి. 2009, 2019 లోక్‌సభ ఎన్నికల్లో వరుణ్‌గాంధీ పిలిభిత్‌ నుంచి పోటీ చేసి రెండోసార్లు గెలుపొందారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…