దారుణం.. తిండి పెట్టేందుకు డబ్బులు లేవని చిన్నారిని చంపిన సాఫ్ట్‌వేర్ తండ్రి..! అసలేమైందంటే..

|

Nov 28, 2022 | 9:35 AM

సాఫ్ట్‌వేర్ ఉద్యోగం పోవడం, బిట్ కాయిన్‌లో తీవ్రంగా నష్టపోవడంతో.. ఓ తండ్రి దారుణ నిర్ణయం తీసుకున్నాడు. కన్న కూతురుని పోషించలేనన్న భయంతో.. కాలయముడిగా మారాడు. బిడ్డకు చాక్లెట్ ఇచ్చి..

దారుణం.. తిండి పెట్టేందుకు డబ్బులు లేవని చిన్నారిని చంపిన సాఫ్ట్‌వేర్ తండ్రి..! అసలేమైందంటే..
Father Kills Daughter
Follow us on

Bengaluru Techie Kills 2-Year-Old Daughter: సాఫ్ట్‌వేర్ ఉద్యోగం పోవడం, బిట్ కాయిన్‌లో తీవ్రంగా నష్టపోవడంతో.. ఓ తండ్రి దారుణ నిర్ణయం తీసుకున్నాడు. కన్న కూతురుని పోషించలేనన్న భయంతో.. కాలయముడిగా మారాడు. బిడ్డకు చాక్లెట్ ఇచ్చి.. చిన్నారితో సహా చెరువులోకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అయితే.. ఈ ఘటనలో కూతురు ఊపిరాడక మరణించగా.. తండ్రి ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటన దారుణ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో చోటుచేసుకుంది. కోలార్‌ బెంగళూరులో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్న రాహుల్‌.. అప్పుల బాధతో ఆత్మహత్యకు యత్నించాడని బెంగళూరు పోలీసులు తెలిపారు. సిటీ శివారుల్లోని ఓ లేక్‌లో పాపతో కలిసి దూకేశాడు. ఐతే చిన్నారి మృతి చెందగా రాహుల్‌ మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. పాపకు తిండి పెట్టేందుకు కూడా డబ్బులు లేవని.. అందుకే చిన్నారితో సహా ఆత్మహత్యకు ప్రయత్నించినట్టు రాహుల్‌ చెబుతున్నాడు.

గుజరాత్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ రాహుల్‌.. భార్య, పాపతో కలిసి బెంగళూరులో ఉంటున్నాడు. అయితే, 6 నెలలుగా.. జాబ్‌ పోవడం.. బిట్‌కాయిన్‌లో పెట్టుబడులు పెట్టి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నట్టు తెలుస్తోంది. రాహుల్‌పై గతంలో ఫేక్‌ రాబరీ కేసు ఫైల్‌ అయినట్టు పోలీసుల విచారణలో బయటపడింది. అయితే, అంతకుముందు రాహుల్ ఇంట్లో ఉన్న బంగారాన్ని తానే కుదువపెట్టి చోరీ అయిందని పోలీసులకు కంప్లైంట్‌ ఇచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ కేసు విచారణలో భాగంగా.. రాహుల్‌ను స్టేషన్‌కు పిలిచారు పోలీసులు. దీంతో ఏం జరుగుతుందోననే భయంతోనే అతను ఆత్మహత్యకు యత్నించినట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. నిజానిజాలు తేల్చేందుకు దర్యాప్తు ప్రారంభించారు. కాగా, ఈ ఘటన బెంగళూరులో సంచలనంగా మారింది. చిన్నారిని చంపేందుకు అతనికి చెతులెలా వచ్చాయని.. స్థానికులు ఫైర్ అవుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం