Bharata Mata: భరత మాత చిత్ర పటం.. బ్రిటన్ దేవతకు అనుకరణ అంటూ సోషల్ మీడియాలో వాదన.. దీనిలో నిజం ఎంతో తెలుసా మీకు

|

Aug 09, 2022 | 10:54 AM

ఫేస్‌బుక్‌లో.. దిలీప్ సి. మండల్ అనే నెటిజన్ భారత్ మాత బ్రిటన్ దేవత అనుకరణ అని రాశారు. అసలు భారతమాత అలా ఉండదన్నారు.  అతని పోస్ట్‌పై జర్నలిస్టు విష్ణు శర్మ స్పందించారు. బ్రిటన్ దేవత..  భారత మాతా దేవత కాపీ అని మండల్ చెప్పారు. వాస్తవానికి..

Bharata Mata: భరత మాత చిత్ర పటం.. బ్రిటన్ దేవతకు అనుకరణ అంటూ సోషల్ మీడియాలో వాదన.. దీనిలో నిజం ఎంతో తెలుసా మీకు
Bharat Mata
Follow us on

Bharata Mata: ప్రస్తుతం సోషల్ మీడియా (Social Media) ప్లాట్ ఫామ్ ఫేస్ బుక్ లో(Face Book) చర్చ నడుస్తోంది. భారత మాత బ్రిటన్ దేవత (British Goddess) అనుకరణ అని చర్చలో ఒక వైపు వాదన. భారత దేశం అసలు భారతమాత అలా ఉండదనేది వార్త. భారత మాత సింహంపై స్వారీ చేస్తున్న చిత్రం భారతదేశంలో ప్రసిద్ధి చెందిందని..  అదే విధమైన ఫోటో బ్రిటన్ దేవత అనే వార్త హల్ చల్ చేస్తోంది. అయితే ఈ పోస్ట్‌పై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అటువంటి పరిస్థితిలో భారత మాత చరిత్ర ఏమి చెబుతుందో తెలుసుకోవడం ముఖ్యం. భారత మాత మొదటి చిత్రం ఎప్పుడు, ఎలా రూపొందించబడింది.. ఆమె రూపం ఎలా తయారు చేయబడింది.. అసలు సోషల్ మీడియాలో చర్చ ఎలా మొదలైంది.. దానికి యూజర్లు ఏం సమాధానం ఇచ్చారు, భారతమాత ఫోటో విషయంలో చరిత్ర ఏం చెబుతోంది  ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుకుందాం..

చర్చ ఎలా మొదలైందంటే? 
ఫేస్‌బుక్‌లో.. దిలీప్ సి. మండల్ అనే నెటిజన్ భారత్ మాత బ్రిటన్ దేవత అనుకరణ అని రాశారు. అసలు భారతమాత అలా ఉండదన్నారు.  అతని పోస్ట్‌పై జర్నలిస్టు విష్ణు శర్మ స్పందించారు. బ్రిటన్ దేవత..  భారత మాతా దేవత కాపీ అని మండల్ చెప్పారు. అయితే తాను రెండు ఫోటోలను షేర్ చేస్తున్నానంటూ.. రెండు చిత్రాలను షేర్ చేశారు. మొదటిది సింహంతో పోరాడుతున్న బ్రిటానియా దేవత. ఈ చిత్రంలో సింహం లేదని పేర్కొన్నారు. వాస్తవానికి ఈ సింహాన్ని క్వీన్ విక్టోరియా పాలన తర్వాత.. బహుశా భారత మాత రూపం ప్రకటన తర్వాత అక్కడ ఉంచారు.

భరత మాత చిత్ర పటాన్ని మొదట బంకిం చంద్ర ఛటర్జీ తరువాత అవనీంద్ర నాథ్ ఠాగూర్, రాజా రవివర్మ భరత మాత చిత్రాన్ని రూపొందించారు, అప్పుడు సింహం లేదు. అనంతరం భరతమాతకు దుర్గామాత రూపాన్ని ఇస్తూ.. సింహాన్ని కూడా చేర్చారు. కనుక మనం ఈ చిత్ర పటాన్ని  బ్రిటిష్ వారి కాపీగా ఎందుకు పరిగణించాలని ప్రశ్నించారు. భరతమాత ఫొటోలో 1858లో సింహాన్ని జతచేశారు. 10వ శతాబ్దంలో బుద్గాంలో సింహాలతో ఉన్న దుర్గామాత  పురాతన విగ్రహం బయల్పడింది. మొదటి భారత చిత్రం విషయంలోకి వెళ్తే.. బ్రిటన్ దేవత సింహాన్ని చంపడం, భారతదేశానికి వ్యతిరేకంగా నిరసనగా బెంగాల్ పులిని చంపినట్లు చూపబడింది. 1857లో కాన్పూర్‌లో బ్రిటిష్ వారి ఊచకోత తర్వాత… ఎవరైనా తమ దేశానికి సంబందించిన దేవతను ఇక్కడ ఎందుకు కాపీ చేస్తారో ఆలోచించండి? అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. అంతేకాదు ఇలాంటి సమయం వృధా అయిన విషయాలపై ఎవరూ దృష్టి పెట్టవద్దని సూచించారు. విష్ణు శర్మ పోస్టు వివరణ తర్వాత భరత మాత ఫోటో విషయంపై చర్చ మరింత ఊపందుకుంది.

ఇవి కూడా చదవండి

భరత మాత మొదటి చిత్రాన్ని ఎప్పుడు రూపొందించారంటే:
20వ శతాబ్దంలో.. భారతదేశంలో జాతీయవాదం ఓ రేంజ్ కి చేరుకుంది. ఈ జాతీయవాదంతో భారత మాత కూడా ముడిపడి ఉంది. స్వదేశీ ఉద్యమం, బెంగాలీ చిత్రకారుడు అవనీంద్రనాథ్ ఠాగూర్ మొదటిసారిగా 1905లో భారతమాత చిత్రాన్ని చిత్రించాడు. భరత మాతను మొదట బెంగాల్ సంప్రదాయ కాషాయ దుస్తులు ధరించినట్లు చిత్రీకరించారు. ప్రారంభ కాలంలో.. భరత మాతకు నాలుగు చేతులు.. ఆ చేతుల్లో పుస్తకం, వడ్లు, దండ, తెల్ల వస్త్రం ఉన్నట్లు చూపించారు. బెంగాల్‌లో బ్యాంగ్ మాతా అని కూడా పిలిచేవారు.

భారతమాతకు తామరపువ్వు :
స్వామి వివేకానంద శిష్యురాలు అయిన సోదరి నివేదిత కూడా భారతమాత చిత్రాన్ని మరింత అందంగా తీర్చిదిద్దడంలో తన వంతు సహకారం అందించింది. అబనీంద్రనాథ్ ఠాగూర్ పెయింటింగ్‌కు ఆధ్యాత్మికతను జోడించి భరత మాతకు మరింత మెరుగులు దిద్దారు. భరతమాత పాదాల క్రింద ఒక తామర పువ్వును చూపించారు. వెనుక నీలి ఆకాశం ఉన్నట్లు చూపించారు.

భరతమాత చిత్రం స్వాతంత్య్ర వీరులకు.. కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. ఆ సమయంలో స్వాతంత్య్ర పోరాటంలో చురుకైన పాత్ర పోషిస్తున్న సుబ్రహ్మణ్యం భారతి, గంగానదిని భూమిపై భారతమాతను శక్తిగా అభివర్ణించారు. క్రమంగా భారతమాత ప్రజలలో శక్తి , జాతీయతకు చిహ్నంగా మారింది. సుబ్రహ్మణ్యం భారతి రూపొందించిన భారతమాత చిత్రంలో హిందూ, ముస్లిం మతాలు రెండూ ప్రజల మధ్య ఐక్యతను చాటాయి. ఈ మార్పుల్లో భాగంగా సింహాలు భారత మాతను దుర్గ అమ్మవారిని కలగలిపి చూపించింది. .

స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా 1936లో వారణాసిలో భారత మాత మొదటి ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయాన్ని మహాత్మా గాంధీ ప్రారంభించారు. దేశంలోనే ఇలాంటి ఆలయం ఇదే మొదటిది. అనంతరం విశ్వహిందూ పరిషత్ 1983లో హరిద్వార్‌లో అలాంటి మరొక ఆలయాన్ని నిర్మించింది. ఈ ఆలయాన్ని అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ప్రారంభించారు.

బ్రిటన్ దేవత , భారత్ మాతకు మధ్య సంబంధం ఉందా?
చరిత్రను పరిశీలిస్తే, భారతమాత చిత్రాన్ని రూపొందించడానికి ప్రేరణ హిందువుల ఆరాధ్య దేవత దుర్మమ్మవారి నుంచి తీసుకున్నట్లు తెలుస్తోంది. బెంగాల్ దేవత ను ఆధారంగా తీసుకుని బెంగాలీ చిత్రకారుడు అబనీంద్రనాథ్ ఠాగూర్  భరత మాతకు మరిన్ని మెరుగులు దిద్దారు.    ప్రారంభ ఛాయాచిత్రాలలో సింహం లేదు. కాలక్రమేణా, స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న విప్లవకారులు , బ్రిటిష్ పాలనపై కోపంగా ఉన్న భారతీయులు భరత మాత చిత్రాలలో అనేక మార్పులు చేశారు. ఈ మార్పుల్లో భాగంగా అబనీంద్రనాథ్ ఠాగూర్ మొదటి చిత్రం రూపం మారిపోయింది. చరిత్ర కోణంలో చూసినా.. బ్రిటానియా దేవత చిత్రానికి.. భారత మాత చిత్రం పూర్తిగా భిన్నంగా ఉందని తెలుస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..