భారతదేశం డిజిటలైజేషన్‌లో ముందంజలో ఉందని.. డిజిటల్ లావాదేవీల పరంగా అగ్ర దేశాలతో పోలిస్తే టాప్ లో ఉన్నట్లు కేంద్ర రైల్వే, కమ్యూనికేషన్స్, ఐటీ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. 2022 డిసెంబర్ గణాంకాల ప్రకారం.. భారతదేశంలో డిజిటల్ పేమెంట్ ట్రాన్జక్షన్స్ 1.5 ట్రిలియన్ డాలర్స్ జరిగినట్లు వెల్లడించారు. మొత్తం అమెరికాలో జరిగిన డిజిటల్ ట్రాన్జాక్షన్స్ తోపాటు బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ దేశాల్లో జరిగిన డిజిటల్ లావాదేవాల కంటే.. నాలుగు రేట్ల అత్యధికంగా భారత్‌లో జరిగినట్లు అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. సాంకేతిక ఆర్ధిక వృద్ధి పరంగా దేశం మరింత ముందుకు సాగుతున్నట్లు వివరించారు.
ఫిష్ టేక్స్ వాటర్ టు వాటర్ వంటి డిజిటల్ టెక్నాలజీలను భారతదేశం అవలంబించిందని అశ్విని వైష్ణవ్ వివరించారు. దావోస్‌లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో బిజినెస్ టుడే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాహుల్ కన్వాల్‌తో జరిగిన సంభాషణలో మంత్రి పలు విషయాలను వివరించారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థలోని ప్రతి అంశం నేడు చాలా వేగంగా డిజిటలైజ్ అవుతోందని అభిప్రాయపడ్డారు. ఇండియా స్టాక్ ప్రజల జీవితాల్లో ఒక ప్రాథమిక మార్పును చేసిందని, సాధికారతనివ్వడంతోపాటు.. కొత్త సాధనాలను అందించిందని, కృత్రిమ మేధస్సు (AI) ద్వారా మరింత బలోపేతం అవుతుందని విశ్వసిస్తున్నట్లు తెలిపారు.
వేగవంతమైన విజయాలలో ఒకటి భాషిణి (దేశియ ట్రాన్స్‌లేషన్ టూల్) అని తెలిపారు. దానిని.. భాషిణి టూల్ కి AI సాధనాన్ని ఏకీకృతం చేసామని తెలిపారు. ఇది వేగంగా ఒక భారతీయ భాష నుంచి మరొక భాషకు అనువదిస్తుందని.. దానిని ChatGPTతో అనుసంధానించామని.. దీనిద్వారా మంచి ఫలితాలను చూస్తున్నామన్నారు. భారతదేశంలోని లోతట్టు ప్రాంతాలలో నివసించే వారు ఎవరైనా ChatGPTకి హిందీలో ప్రశ్న అడగవచ్చని.. ChatGPT వెంటనే సమాధానాన్ని కనుగొంటుంన్నారు. ఇలా సైబర్ సెక్యూరిటీ, హెల్త్‌కేర్, మల్టిపుల్ సెక్టార్‌లలో మంచి అప్లికేషన్‌లు ఉన్నాయన్నారు.
కొత్త డిజిటల్ సాంకేతికత అందుబాటులోకి వచ్చిన క్షణం నాటి నుంచి.. దానిని స్వీకరించే విషయంలో ఎప్పుడూ ముందంజలోనే ఉన్నట్లు తెలిపారు. భారతదేశంలో టెక్నాలజీ పరపతి పరిధి నిరంతరం పెరుగుతూనే ఉందని తెలిపారు. అయితే బహుళ పరిశ్రమలు, ఇతర సామాజిక రంగాలలో సాంకేతికతను ఉపయోగించుకునే విషయంలో తాము ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నామని నమ్ముతున్నామని.. దీనిని ఇంకా మెరుగుపర్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. సమాజానికి మరింత ప్రయోజనం చేకూర్చే విధంగా సాంకేతికతను మెరుగు పరుస్తున్నామని.. తామ ఆలోచనా విధానంతోనే డిజిటల్ లావాదేవీలు పెరిగినట్లు వివరించారు.
ఇండియా సెమీకండక్టర్ మిషన్‌లో అవసరమైనన్ని పెట్టుబడులు పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. కేవలం మొదటి విడతలోనే 10 బిలియన్ డాలర్ల (రూ. 76,000 కోట్లు) ప్రతిపాదిత పెట్టుబడులు పెట్టినట్లు వెల్లడించారు. ఇది త్రైమాసికం లేదా రెండు లేదా ఒక సంవత్సరంలో చేసే పని కాదని తాము అర్థం చేసుకున్నామని.. దీనికి పట్టుదల, ప్రయత్నం అవసరమని వైష్ణవ్ సెమీకండక్టర్ పెట్టుబడులపై వివరించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..