Agnipath Protest: ఒక్క రైలు బోగీ తయారికి అయ్యే ఖర్చు తెలిస్తే మైండ్‌ బ్లాక్‌ అవ్వాల్సిందే.. అంతా ప్రజాధనమే

|

Jun 17, 2022 | 1:08 PM

Agnipath Protests: అగ్నిపథ్ స్కీమ్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పలు చోట్ల నిరసనలు వ్యక్తమవుతున్నాయి. బీహార్‌లో పలు చోట్ల.. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ లో రైళ్లకు నిప్పుపెట్టారు. అయితే ఆందోళనకారులు నిరసన తెలిపేందుకు నిప్పంటించే రైళ్ల తయారికీ ఎంత ఖర్చవుతుందో తెలుసా..?

Agnipath Protest: ఒక్క రైలు బోగీ తయారికి అయ్యే ఖర్చు తెలిస్తే మైండ్‌ బ్లాక్‌ అవ్వాల్సిందే.. అంతా ప్రజాధనమే
Follow us on

Agnipath Protests Secunderabad: ఆర్మీ రిక్రూట్‌మెంట్ కోసం ‘అగ్నిపథ్ స్కీమ్’ ప్రారంభించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అగ్నిపథ్ స్కీమ్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పలు చోట్ల నిరసనలు వ్యక్తమవుతున్నాయి. పాత పద్దతిలోనే సైనిక నియామకాలు చేపట్టాలని హైదరాబాద్‌, ఢిల్లీ,యూపీ, బీహార్ సహా పలు ఉత్తరాది రాష్ట్రాల్లో యువత ఆందోళన చేస్తున్నారు. బీహార్‌లో పలు చోట్ల.. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ (Secunderabad Railway Station) లో రైళ్లకు నిప్పుపెట్టారు.  మూడు రైళ్లకు నిప్పంటించారు ఆందోళనకారులు. మంటల్లో కొన్ని బోగీలు తగలబడ్డాయి.  అటు దేశవ్యాప్తంగానూ పలు రాష్ట్రాల్లో ఆందోళనకారులు రైళ్లను తగులబెట్టి అగ్నిపథ్ పై తమ నిరసనను తెలియజేశారు. రైల్వే శాఖకు కోట్లాది రూపాయల నష్టం వాటిల్లింది.  అయితే, ఆందోళనకారులు నిరసన తెలిపేందుకు నిప్పంటించే రైలు బోగీ తయారికీ ఎంత ఖర్చవుతుందో తెలుసా..?

రైలు తయారీకి అయ్యే ఖర్చును తెలుసుకునే ముందు, రైలులో రెండు భాగాలు ఉన్నాయని తెలుసుకోవాలి. మొదటి భాగం రైలు ఇంజిన్ తో పాటు రైలు ఇతర భాగం దాని కోచ్. మొత్తం రైలు ఇంజిన్ నుండి నియంత్రించబడుతుంది. సంబంధిత సమాచారం మేరకు రైలు ఇంజిన్‌ను తయారు చేయడానికి దాదాపు రూ.20 కోట్లు ఖర్చవుతుంది. రైలు ఇంజన్లు భారతదేశంలోనే తయారు చేయబడినవి కాబట్టి ఈ ధర చాలా తక్కువనే చెప్పాలి.

రైలు ఇంజిన్‌తో పాటు అనేక రకాల కోచ్‌లు ఇందులో ఉన్నాయి. రైలు కోచ్‌ను తయారు చేసేందుకు దాదాపు రూ.2 కోట్లు ఖర్చవుతుంది. అయితే, కోచ్ సౌకర్యాలను బట్టి వాటి ధర మారుతుంది. సాధారణ, స్లీపర్‌లతో పోలిస్తే AC కోచ్‌లు ఖరీదైనవి. దీని ప్రకారం ఎక్స్ ప్రెస్ రైలు నిర్మాణానికి దాదాపు 68 కోట్లు ఖర్చవుతుంది. ఎక్స్‌ప్రెస్ రైలులో 24 కోచ్‌లు ఉంటాయి.. కాబట్టి ఒక్కో కోచ్‌కు రూ.2 కోట్ల చొప్పున, దాని ఖరీదు రూ.48 కోట్లు అవుతుంది. అదే సమయంలో దీని ఇంజన్ ధర రూ.20 కోట్ల వరకు ఉంటుంది. అదే సమయంలో, సాధారణ ప్యాసింజర్ రైలు తయారీకి మొత్తం 50 నుండి 60 కోట్లు ఖర్చు అవుతుంది. ఎందుకంటే ఈ రైళ్ల కోచ్‌లలో సౌకర్యాలు ఎక్స్‌ప్రెస్ రైళ్ల కంటే కొంచెం తక్కువగా ఉంటాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి