విద్యార్థులు తమకు నచ్చిన కోర్సులు చదువుకోవచ్చుః మోదీ

భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకుని 30 ఏళ్ల తర్వాత నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ వెల్లడించారు. 21వ శతాబ్దంలో యువతకు నైపుణ్యం ఎంతో అవసరమని..

విద్యార్థులు తమకు నచ్చిన కోర్సులు చదువుకోవచ్చుః మోదీ
Follow us

|

Updated on: Aug 07, 2020 | 1:58 PM

National Educational Policy focuses on ‘how to think’: భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకుని 30 ఏళ్ల తర్వాత నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ వెల్లడించారు. 21వ శతాబ్దంలో యువతకు నైపుణ్యం ఎంతో అవసరమని.. అందుకే జాతీయ విద్యావిధానంలో ఎన్నో కొత్త సంస్కరణలు తీసుకొచ్చామని మోదీ తెలిపారు. తాజాగా నూతన జాతీయ విద్యా విధానంపై ప్రసంగించిన ఆయన ఒకే దేశం.. ఒకే విద్యా విధానం ఉండాలని చెప్పుకొచ్చారు.

దేశవ్యాప్తంగా నూతన విద్యావిధానంపై మేధావులు విస్తృతంగా చర్చించాలి. ప్రస్తుత విద్యా విధానంలో ఎన్నో లోపాలున్న కారణంగానే కొత్త విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాం. దీనికి తాను పూర్తిగా మద్దతు ఇస్తున్నట్లు మోదీ చెప్పారు. విస్తృత ప్రయోజనాల దృష్ట్యా కొత్త విద్యా విధానాన్ని అమలులోకి తీసుకొచ్చాం. నర్సరీ నుంచి పీజీ వరకు విద్యారంగంలో సమూల మార్పులను చేశామని ఆయన అన్నారు.

విద్యార్ధులు కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని చెప్పారు. కొత్త విద్యా విధానంతో విద్యార్ధులు తమకు నచ్చిన కోర్సులను చదువుకోవచ్చునని అన్నారు. రాష్ట్రాలన్నీ కూడా ఎలాంటి అపోహలు, ఆందోళన చెందకుండా ఈ నూతన విద్యా విధానాన్ని అమలు చేయాలని మోదీ తెలిపారు. జాతి నిర్మాణంలో ఈ విధానం కీలక పాత్ర పోషిస్తుందని చెప్పిన ఆయన.. పిల్లలు తమ లక్ష్యం చేరుకునేందుకు ఈ కొత్త విధానం ఎంతగానో తోడ్పడుతుందని వివరించారు.

Also Read:

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. పల్లెల్లోనూ మాస్క్ తప్పనిసరి.. లేదంటే జరిమానా!

కోవిడ్ ఇన్ఫెక్షన్లు ఆరు రకాలు.. ఆ లక్షణాలు ఉంటే జాగ్రత్త.!

జగన్ కీలక నిర్ణయం.. అక్టోబర్ 15 నుంచి కాలేజీలు ఓపెన్..