చెన్నై కెప్టెన్‌గా తప్పుకోనున్న ధోని.. రేసులో డుప్లెసిస్.? ఐపీఎల్ 2021లో సీఎస్కేకు కొత్త నాయకుడట.!

వచ్చే ఏడాది ఐపీఎల్‌కు ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకుంటాడని.. చెన్నై జట్టు పగ్గాలు దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ డుప్లెసిస్ చేపట్టే అవకాశం ఉందని టీమిండియా..

  • Ravi Kiran
  • Publish Date - 5:39 pm, Sun, 15 November 20
చెన్నై కెప్టెన్‌గా తప్పుకోనున్న ధోని.. రేసులో డుప్లెసిస్.? ఐపీఎల్ 2021లో సీఎస్కేకు కొత్త నాయకుడట.!

MS Dhoni: వచ్చే ఏడాది ఐపీఎల్‌కు ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకుంటాడని.. చెన్నై జట్టు పగ్గాలు దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ డుప్లెసిస్ చేపట్టే అవకాశం ఉందని టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ అభిప్రాయపడ్డాడు. జట్టులో ఆటగాడిగా కొనసాగే క్రమంలో ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకుని ఆ బాధ్యతలను డుప్లెసిస్‌కు అప్పగిస్తాడని బంగర్ భావిస్తున్నాడట. ఖచ్చితంగా ఐపీఎల్ 2021లో సీఎస్కే కొత్త కెప్టెన్‌ను చూడబోతోందని స్పష్టం చేశాడు.

మూడుసార్లు ఛాంపియన్‌గా, ఐదుసార్లు రన్నరప్‌గా నిలిచినా సీఎస్కే.. ఐపీఎల్ 2020లో లీగ్ స్టేజిలోనే నిస్క్రమించింది. సురేశ్‌ రైనా, హర్భజన్‌ సింగ్‌ వంటి స్టార్ ఆటగాళ్లు లేకపోవడం.. సీజన్ ఆరంభం ముందు కొంతమంది ప్లేయర్స్ కరోనా బారిన పడటం వంటి అంశాలు చెన్నై జట్టును తీవ్రంగా దెబ్బ తీశాయి. వరుస వైఫల్యాలతో ఘోర ఓటములను చవి చూసింది. ఈ క్రమంలోనే ధోనిపై విమర్శలు వెల్లువెత్తాయి. ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని.. జట్టును ప్రక్షాళన చేయాలని ట్రోలింగ్ చేసిన సంగతి విదితమే.

Also Read: 

‘అమ్మోరు తల్లి’… దొంగ బాబా బెదుర్స్.. కామెడీ అదుర్స్.. మంచి ప్రయత్నం..

రికార్డులు తిరగరాస్తోన్న ‘మాస్టర్’ టీజర్… దళపతి, విజయ్ సేతుపతిల క్రేజ్‌కు ఇదే నిదర్శనం..

#BiggBoss4: బిగ్ బాస్ 4 టైటిల్ విన్నర్ అతడేనట.! టాప్ 5లో ఉండే కంటెస్టెంట్స్ వీరే.?

బాలుడి అదృశ్యంపై కలకలం.. కిడ్నాపర్ల బేరం..