విభజన హామీలు అమలు చేయండి : పార్లమెంట్‌లో ఎంపీ రామ్మోహన్ నాయుడు

ఆంధ్రప్రదేశ్‌కు నిధుల కేటాయింపుపై కేంద్రం అనుసరించిన విధానాలను ఎండగట్టారు శ్రీకాకుళం ఎంపీ కె. రామ్మోహన్‌నాయుడు. పార్లమెంట్‌లో బడ్జెట్‌పై ఆయన కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్ధాయిలో మండిపడ్డారు. దేశాభివృద్ది అంటే కేవలం గుజరాత్ అభివృద్ది మాత్రమే కాదని, విభజనతో నష్టపోయిన ఏపీకి న్యాయం చేయాలని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని వాపోయారు. గుజరాత్ అభివృద్ధి చెందిన రాష్ట్రమని అందరికీ తెలుసని, కానీ అలాంటి రాష్ట్రానికే మళ్లీ గిఫ్ట్ సిటీని ప్రతిపాదించడంపై నాయుడు విమర్శించారు. విభజనతో ఎంతో నష్టపోయిన ఏపీవైపు కన్నెత్తి […]

విభజన హామీలు అమలు చేయండి : పార్లమెంట్‌లో ఎంపీ రామ్మోహన్ నాయుడు
Follow us

| Edited By: Srinu

Updated on: Jul 10, 2019 | 5:04 PM

ఆంధ్రప్రదేశ్‌కు నిధుల కేటాయింపుపై కేంద్రం అనుసరించిన విధానాలను ఎండగట్టారు శ్రీకాకుళం ఎంపీ కె. రామ్మోహన్‌నాయుడు. పార్లమెంట్‌లో బడ్జెట్‌పై ఆయన కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్ధాయిలో మండిపడ్డారు. దేశాభివృద్ది అంటే కేవలం గుజరాత్ అభివృద్ది మాత్రమే కాదని, విభజనతో నష్టపోయిన ఏపీకి న్యాయం చేయాలని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని వాపోయారు. గుజరాత్ అభివృద్ధి చెందిన రాష్ట్రమని అందరికీ తెలుసని, కానీ అలాంటి రాష్ట్రానికే మళ్లీ గిఫ్ట్ సిటీని ప్రతిపాదించడంపై నాయుడు విమర్శించారు.

విభజనతో ఎంతో నష్టపోయిన ఏపీవైపు కన్నెత్తి కూడా చూడకుండా కేవలం గుజరాత్‌కి మాత్రమే అదనపు రాయితీలు ప్రకటించం ఏమిటని ప్రశ్నించారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఏపీతో పాటు చిన్న రాష్ట్రాలు ఎన్నటికీ గుజరాత్‌కు పోటీగా నిలిచే అవకాశం ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాలనే ఎక్కవగా పట్టించుకుంటే న్యాయం ఎలా జరుగుతుందని ప్రశ్నించారు రామ్మోహన్‌నాయడు.

ఏపీకి సంబంధించి కేంద్ర బడ్జెట్‌లో నిధుల కేటాయింపు సరిగ్గా జరగలేదని అటు అధికార వైసీపీతో పాటు ప్రతిపక్ష టీడీపీ కూడా కేంద్రంపై విమర్శలు చేస్తోంది.