ఉగ్రవాదుల హిట్ లిస్టులో ఎమ్మెల్యే రాజాసింగ్

బీజేపీ గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్ ను టెర్రరిస్టులు టార్గెట్ చేశారు. ఉగ్రవాదుల హిట్ లిస్టులో రాజాసింగ్ పేరు ఉన్నట్టు తెలుస్తోంది. నిఘా వర్గాల హెచ్చరికతో హైదరాబాద్ పోలీసులు అలర్ట్ అయ్యారు.

ఉగ్రవాదుల హిట్ లిస్టులో ఎమ్మెల్యే రాజాసింగ్
Follow us

| Edited By:

Updated on: Aug 29, 2020 | 11:57 AM

బీజేపీ గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్ ను టెర్రరిస్టులు టార్గెట్ చేశారు. ఉగ్రవాదుల హిట్ లిస్టులో రాజాసింగ్ పేరు ఉన్నట్టు తెలుస్తోంది. నిఘా వర్గాల హెచ్చరికతో హైదరాబాద్ పోలీసులు అలర్ట్ అయ్యారు. రాజాసింగ్ కు పోలీసులు భద్రతను పెంచారు. ఆయన ఇంటి దగ్గర ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.

ఉగ్రవాదుల హిట్ లిస్టులో రాజాసింగ్ పేరు ఉందని తెలంగాణ పోలీసులకు సమాచారం అందింది. ఇటీవలే అరెస్టైన ఉగ్రవాదుల హిట్ లిస్టులో ఎమ్మెల్యే రాజాసింగ్ పేరు ఉన్నట్లు సమాచారం. దీంతో ఎమ్మెల్యే ఇంటి వద్ద భద్రతను భారీగా పెంచారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ హైదరాబాద్ కమిషనర్ అంజనీకుమార్ ఓ లేఖ రాశారు. ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి వుండటంతో ద్వి చక్ర వాహనంపై తిరగవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన బుల్లెట్ ప్రూఫ్ వాహనంలోనే ప్రయాణించాలని కమిషనర్ పలు సూచనలు చేశారు.

ఈ విషయంపై ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. పోలీసులు తన ఇంటి పరిసర ప్రాంతాలపై ఆరా తీసినట్టు తెలిపారు. తన గన్ మెన్ గన్ కూడా మార్చినట్టు చెప్పారు. ఎవరి నుంచి తనకు ముప్పు ఉందనే విషయాన్ని పోలీసులు స్పష్టం చేయాలని అన్నారు. దీటెర్రరిస్టుల నుండి ఉందా, లేదా స్థానికంగా ఉండే ఏదైనా సంస్థల నుండి ఉందో స్పష్టం చేయాలని కోరారు. రాష్ట్ర హోం మంత్రికి, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఆయన లేఖలు రాస్తున్నానని తెలిపారు.

నిత్యం ప్రజల్లోనే ఉండే ఎమ్మెల్యే రాజాసింగ్‌ తన సెక్యూరిటీని పెద్దగా పట్టించుకోరు. నియోజకవర్గంలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా వెంటనే అక్కడికి వెళ్లిపోతారు. కొన్నిసార్లు ద్విచక్ర వాహనంపైనే ప్రయాణిస్తుంటారు. టెర్రరిస్టుల హిట్ లిస్టులో రాజాసింగ్‌ ఉన్నారనే విషయం తెలియడంతో పోలీసులు అలర్ట్‌ అయ్యారు. ఎక్కడకు వెళ్లాలన్నా.. పోలీసులకు ముందస్తు సమాచారం అందించాలని కోరుతున్నారు. డీసీపీ స్థాయి అధికారి రాజాసింగ్‌ భద్రతను పర్యవేక్షిస్తున్నారు.

రాజాసింగ్ ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ దూకుడుగా ఉంటారు. అవసరమైతే సొంతపార్టీ నేతలపైనా తిరుగుబాటు స్వరం వినిపిస్తున్నారు. అలాంటి ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రాణాలకే ముప్పు ఉందని పోలీసులే హెచ్చరించడం రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు