గ్రామీణ విద్యార్థుల కోసం ఈ – విద్యావారధి…

ఇందులో భాగంగా గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లోని విద్యార్థులకు విద్యావారధి ద్వారా డిజిటల్‌ విద్యను అందించనుంది. ఈ వాహనాలను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ ప్రారంభించారు..

గ్రామీణ విద్యార్థుల కోసం ఈ - విద్యావారధి...
Follow us

|

Updated on: Jul 31, 2020 | 7:32 PM

Inaugurated The Vidya Varadhi in AP : కరోనా మహామ్మారి వ్యాప్తి చెందుతుండటంతో అంతా ఇంటి నుంచే పనిచేస్తున్నారు. పిల్లలు చదువులు ఆన్ లైన్ లో కి మారిపోయాయి. అయితే ఆన్‌లైన్‌ విద్య అందుబాటులో లేని గ్రామాల్లో విద్యార్థుల కోసం విద్యావారధి వాహనాలను ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది.

ఇందులో భాగంగా గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లోని విద్యార్థులకు విద్యావారధి ద్వారా డిజిటల్‌ విద్యను అందించనుంది. ఈ వాహనాలను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యావారధి పుస్తకాలను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కరోనా వ్యాప్తి నేపథ్యంలో పాఠశాలలు, కళాశాలలు తెరవలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అన్నీ అందుబాటులో ఉండవని… ఇందుకు పరిష్కార మార్గంగా విద్యావారధి కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు.

ఈ-విద్యావారధిలో ఇవే ప్రత్యేకతలు..

ఎల్‌సీడీ ప్రొజెక్టర్‌తో కూడిన ఈ-మొబైల్‌ వాహనాల ద్వారా గ్రామాల్లోని విద్యార్థులకు పాఠాలు బోధిస్తారు. ఈ వాహనంలో చిన్న లైబ్రరీ, ఒక ఉపాధ్యాయుడు ఉంటాడు. ఒకటి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులకు సంబంధించిన పాఠ్యాంశాలు అన్నీ అందులో పొందుపర్చారు. ప్రధానంగా విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం కొండ ప్రాంతాల్లో ఈ-మొబైల్‌ వ్యాన్‌లను వినియోగించనున్నారు.