బండి సంజయ్ సర్జికల్ స్ట్రైక్ కామెంట్స్ పై కేటీఆర్ ఫైర్.. ఓట్లు, సీట్ల కోసం మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని ట్వీట్..

బండి సంజయ్ సర్జికల్ స్ట్రైక్ కామెంట్స్ మీద కేటీఆర్ ఫైర్ అయ్యారు.

  • Balaraju Goud
  • Publish Date - 5:13 pm, Tue, 24 November 20

బండి సంజయ్ సర్జికల్ స్ట్రైక్ కామెంట్స్ మీద కేటీఆర్ ఫైర్ అయ్యారు. కేవలం కొన్ని ఓట్లు కొన్ని సీట్ల కోసం సంజయ్ మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని కేటీఆర్ ట్వీట్.. సంజయ్ వ్యాఖ్యలను హోం శాఖ మంత్రి అయిన కిషన్ రెడ్డి సమర్థిస్తారా అంటూ ప్రశ్నించారు కేటీఆర్. బండి సంజయ్ కామెంట్స్ పై కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. ఓట్ల కోసం సీట్ల కోసం బీజేపీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తోందని మండిపడ్డారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పాతబస్తీలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. గ్రేటర్‌ ఎన్నికల్లో బీజేపీ మేయర్ అభ్యర్థిగా గెలిచిన తర్వాత పాతబస్తీ మీద సర్జికల్ స్ట్రైక్ చేస్తామని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. రోహింగ్యాలను, పాకిస్తాన్లను తరిమి కొడతామన్నారు. బీజేపీ బరాబర్ హిందువుల కోసం పోరాడుతుందని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్ రాజకీయాల కోసం రెచ్చగొట్టే మాటల వద్దని హితవు పలికారు.