నారా లోకేశ్​ సహా పలువురికి మంత్రి బాలినేని లీగల్ నోటీసులు

గత నెలలో తమిళనాడులో 5.27 కోట్ల రూపాయలు పట్టుబడటంతో ఏపీలో క‌ల‌క‌లం చెల‌రేగింది. డ‌బ్బు దొరికిన వాహ‌నం ఏపీ మంత్రి బాలినేనిది అంటూ ప్ర‌చారం జ‌రిగింది.

నారా లోకేశ్​ సహా పలువురికి మంత్రి బాలినేని లీగల్ నోటీసులు
Follow us

|

Updated on: Aug 22, 2020 | 7:12 AM

గత నెలలో తమిళనాడులో 5.27 కోట్ల రూపాయలు పట్టుబడటంతో ఏపీలో క‌ల‌క‌లం చెల‌రేగింది. డ‌బ్బు దొరికిన వాహ‌నం ఏపీ మంత్రి బాలినేనిది అంటూ ప్ర‌చారం జ‌రిగింది. ఆ వాహ‌నం త‌న‌ది కాదంటూ ఆయ‌న క్లారిటీ ఇచ్చారు. ఈ క్ర‌మంలో త‌న‌పై త‌ప్పుడు అభియోగాలు మోపీ, ప్ర‌చారం చేశారంటూ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి పలు మీడియా సంస్థలు, వెబ్ ఛానల్ ప్రతినిధులకు, పలువురు నేతలకు లీగల్ నోటీసులు పంపారు.

‘తమిళనాడు పోలీసులకు దొరికిన డబ్బు బంగారం వ్యాపారం చేసే మల్లమిల్లి బాలుకు సంబంధించింది. డబ్బును తరలిస్తున్న వాహ‌నం మీద ఎం.ఎల్.ఏ. స్టిక్కర్ ఉండటంపై ఆ డబ్బు నాదంటూ తప్పుడు ప్రచారం చేశారు. ఆ కారు, డబ్బుకు నాకు సంబంధం లేదని వివరణ ఇచ్చినా అదే పనిగా నాపై బుర‌ద చ‌ల్లారు’ అని మంత్రి ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

అసత్య ప్రచారం చేశారంటూ టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేశ్, బొండా ఉమా, బొల్లినేని రాజ గోపాల నాయుడు సహా కొన్ని మీడియా సంస్థలు, వెబ్ ఛానల్​ ప్రతినిధులకు నోటీసులు పంపించారు.

Also Read : బాబు డైరెక్షన్‌లో రఘురామకృష్ణరాజు